సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరించేవారు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు-పొన్నం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించినవిధంగా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో కేంద్రానికి ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని స్పష్టంచేశారు. ఈ మేరకు యావత్ తెలంగాణ ప్రజలకు టీ ఎంపీల తరఫున తాను భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. ‘సోనియా నాయకత్వంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఇది. ఈ ప్రకటనలో ఒక్క అంశం కూడా మారబోదన్న భరోసా నాకుంది’ అని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం ఇక్కడి 15 మంది ఎంపీలు కలిసికట్టుగా ఉండి నిధులు సాధించుకుంటామని తెలిపారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం.. పార్టీ చేసిన శాసనం వంటిదని, దీనిని కాదనుకునే వారు, ధిక్కరించే వారు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చని ఆయన సీమాంధ్ర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంవూతితో సహా ఎవరైనా బయటకు వెళ్ళిపోవచ్చునని, కానీ వారి తాటాకు చప్పట్లకు పార్టీ బయపడబోదని పొన్నం స్పష్టంచేశారు.
సహేతుకంగా లేని సమైక్య ఉద్యమాన్ని పెద్దగా చూపిస్తూ ఉచితంగా ప్రచారం చేస్తున్నారని, బలవతంగా కలిసి ఉండాలనే వాదనకు ఎందుకు ఇంత ప్రచారం కల్పిస్తున్నారని ఆయన సీమాంధ్ర మీడియాను ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం తెలుగుజాతి ముక్కలైనట్లు సీమాంధ్ర మీడియాలో చూపిస్తున్నారు, హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు ఎన్ని లేవు? రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం నేరమా? అని ప్రశ్నించారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఎందుకు ద్వంద్వ వైఖరితో సమైక్యవాదం అంటున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. సమైక్యమనే వాళ్ళు.. కరీంనగర్‌లో పుట్టి ప్రధానమంవూతిగా పనిచేసిన పీవీ నరసింహారావు విగ్రహం ఒక్కటైనా సీమాంధ్ర జిల్లాల్లో ప్రతిష్ఠించారా? అని ప్రశ్నించారు. జాతీయ నేతల విగ్రహాలను సీమాంవూధలో సంస్కారహీనంగా కూల్చివేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. ఫ్లెక్సి చినిగిందని విద్యార్ధి యాకుబ్‌డ్డిని వరంగల్‌లో నడవరాకుండా కొట్టినారే, ఈ రోజు సీమాంవూధలో చెప్పులతో, రాళ్లతో కొడుతున్న వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించారు. ‘సీమాంవూధలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్నారు. జంతువులను బలి ఇచ్చే సమయంలో చేసేవిధంగా ఒంగోలు డీఈవోకు బొట్టుపెట్టి, పూలదండ వేసి ఊరేగింపు తీశారు.

తెలంగాణ బాలింత వస్తే కర్నూలు ఆస్పవూతిలో వైద్యం నిరాకరించారు. ఇవన్నీ సమైక్యానికి మారుపేరా?’ అని ఆయన ప్రశ్నించారు. రైలురోకో సందర్భంగా పట్టాలు కూడా ఎక్కకముందే తమను అరెస్టులు చేశారని, ఈ రోజు సీమాంవూధలో 15 నిమిషాలు రైల్‌రోకో చేసుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారని, ఇది వివక్ష కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని డీజీపీగా నియమించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఇక సీఎం తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నేతలతో తెలంగాణ వ్యతిరేక వ్యూహరచనలు చేస్తున్నారని, ఆయనకు తెలంగాణ నేతలు ఏ రిప్రజెం ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. తెలంగాణపై బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న వైఖరితో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణ పోరాటంలో టీ కాంగ్రెస్ ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయించిన బీజేపీ.. ఇప్పుడు లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా ఏమీ అనడం లేదని మండిపడ్డారు. ‘తెలంగాణ వద్దు- సమైక్యమే ముద్దు’ అంటున్న సీమాంధ్ర సోదరులు.. తెలంగాణ ఎందుకు వద్దో, కలిసి ఉండటం వల్ల జరిగే లాభాలు ఏమిటో సహేతుక కారణాలు చెబితే తాను తెలంగాణ ఉద్యమం నుంచి వ్యక్తిగతంగా తప్పుకుంటానని సమైక్యవాదులకు పొన్నం సవాలు విసిరారు.

తెలంగాణ ఏర్పాటు తథ్యం
-‘మీట్ ది ప్రెస్’లో టీ కాంగ్రెస్ ఎంపీల సమాధానాలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీజేఎఫ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ ఇచ్చిన సమాధానాలు ఇవి.
-సమైక్యవాదం పేరుతో సీమాంవూధలో అగ్రవర్ణాల వారు ఉద్యమం నడిపిస్తున్నారు. దీన్ని ప్రజలు గుర్తిస్తారు. సమైక్య ఉద్యమంలో పాల్గొనేది లేదంటూ గుంటూరులో దళితులు ర్యాలీ తీస్తే అడ్డుకుని అరెస్టు చేశారు.
-తెలంగాణ డిమాండ్ ప్రత్యేక అంశం. దానికి రెండవ ఎస్సార్సీ వర్తించదు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధాని స్పష్టం చేశారు.
-ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడానికి పార్టీ అగ్రనేతల వైఖరే కారణం.
-రాష్ట్ర విభజన తథ్యం. సీమాంవూధులు మద్రాస్ నుంచి వేరుపడినప్పుడు మద్రాస్ నగరం మాదే అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వేరుపడుతున్నప్పుడు హైదరాబాద్ మాదే అంటున్నారు. కరీంనగర్ వాసులు ఎక్కువ మంది హైదరాబాద్ శివార్లలోని అల్వాల్‌లో ఉంటున్నారు. వారితో ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అంతమావూతాన అల్వాల్ మాది అంటే ఇచ్చేస్తారా?
-టీడీపీ ఎంపి సీఎం రమేష్‌తో బీజేపి నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ , టీడీపి అధినేత చంద్రబాబుతో మాట్లాడుతున్నారు. విజయవాడలోని లగడపాటి ఇంట్లో సమావేశమైన అనంతరం బయటికి వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తామంటూ ప్రకటన చేస్తున్నారు.
-టీటీడీ ఛైర్మన్‌గా ఏనాడు కూడా తెలంగాణ వ్యక్తి ఛైర్మన్ కాలేదు. అదే సీమాంవూధులు మాత్రం తెలంగాణలో పదవులు దక్కించుకుంటారు.
-రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనేది ప్రతిపాదన మాత్రమే. కేంద్రం పరిధిలో అలాంటి ఆలోచన లేనే లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం హైదరాబాద్ రెవిన్యూ జిల్లా పరిధిలోని శాంతి భద్రతల పర్యవేక్షణ కేంద్రం పరిధిలో ఉండేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు.
-తెలంగాణ బిల్లు 2014కు ముందే వస్తుంది. రెండు రాష్ట్రాలతో 2014 ఎన్నికలు జరిపించే బాధ్యత కాంగ్రెస్‌ది. తెలంగాణ ఎంపీలుగా మేము భరోసా ఇస్తున్నాం. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల బహిరంగ సభను అంగీకరించం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.