సీడబ్ల్యూసీ నిర్ణయం అమలుకే

-ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో వివరణ..
-తెలంగాణపై వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదు
-ఆంటోనీ, దిగ్విజయ్, మొయిలీ, పటేల్… నలుగురితో కమిటీ వేసిన సోనియా

తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలన్న నిర్ణయంపై వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చి చెప్పింది. రాష్ట్ర విభజన జరిగే సమయంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తలెత్తే ఆందోళనలను పరిష్కరించేందుకు, వారి అభ్యంతరాలు వినేందుకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ‘లేదు. వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు. నిర్ణయించాల్సిన ఇతర అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయడానికే కానీ నిర్ణయాన్ని ఆపటానికి కాదు’ అని పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. చాకో విలేకరులతో మాట్లాడటానికి ముందు కాంగ్రెస్ అధిష్ఠానం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ ప్రకటించారు. ‘కాంక్షిగెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో వ్యక్తమయ్యే ఆందోళనలను ఈ కమిటీ పరిష్కరిస్తుంది’ అని ఆయన చెప్పారు.

antonyరక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సారథ్యం వహించే ఈ కమిటీలో ఆంటోనీతోపాటు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ప ఉంటారు. పార్టీల మధ్య రెండు అభివూపాయాలు ఉన్నాయని చాకో చెప్పారు. కాంగ్రెస్ కూడా రెండుగా చీలిపోయి ఉందని అన్నారు. అయితే.. ‘మేం ఇప్పుడు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వేదిక అయిన సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంది’ అని చాకో స్పష్టం చేశారు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ.. ఏకగీవ్ర తీర్మానం జరుగని పక్షంలో మీ తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతున్నది? అన్న ప్రశ్నకు.. సహజంగానే వారికి ఈ తీర్మానంపై చర్చ జరిపి, ఆమోదించేందుకు అవకాశం కలుగుతుంది. వారు తీర్మానం ఆమోదించనప్పుడు మాత్రమే మీ ప్రశ్న ఉత్పన్నమవుతుంది’ అని చాకో బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని కాంగ్రెస్ నాన్చుతోందని బీజేపీ చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని బీజేపీని ప్రశ్నించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వంత నేతలే వ్యతిరేకించడంతో వారిని సముదాయించేందుకు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల సాదకబాధకాలను ఈ కమిటీ సభ్యులు వింటారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో సీమాంవూధకు ప్రత్యేకించి రాయల సీమ ప్రాంతానికి నిర్దిష్ట హామీలపై ఈ కమిటీ సమాలోచనలు జరుపుతుందని అంటున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.