సీఎస్ సభాహక్కులను ఉల్లంఘిస్తున్నారు: హరీష్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై టీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్రపతి పంపిన బిల్లును సీఎస్ అశ్రద్ధ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పంపిన బిల్లును ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బిల్లును వెంటనే అసెంబ్లీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే సీఎస్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజెస్ నోటీసు పంపిస్తామని తెలిపారు. ఇదే విషయంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రపతి ఆజ్ఞలను అమలు చేయకుండా సీఎం ఆదేశిస్తే పాటించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వెంటనే తెలంగాణ బిల్లు ప్రతులను సభ్యులకు పంచాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.