సీఎం, స్పీకర్ అతితెలివిగా ప్రవర్తిస్తున్నారు: కేకే

హైదరాబాద్: తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు. ఇవాళ ఆయన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ శిబిరంలో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను అడ్డుకునేందుకు సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ అతి తెలివిగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. టీ బిల్లుపై స్పీకర్ అఫిడెవిట్లు అడగడం తప్పేనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఫ్లకార్డులను ప్రదర్శించిన మంత్రి శైలజానాథ్‌కు సభలో అడుగుపెట్టే హక్కులేదని ధ్వజమెత్తారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.