సీఎం సీమాంధ్ర పక్షపాతి : కోదండరాం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా సీఎం మాట్లాడారు అని ధ్వజమెత్తారు. సీఎం తన అభిప్రాయాన్ని అధిష్టానానికి బలంగా వినిపించాలనుకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిరసన ర్యాలీలు చేపడుతామని తెలిపారు. నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణప్రజలకు పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.