సీఎం వరంగల్ పర్యటన రక్తసిక్తం

వరంగల్‌లో సీఎం పర్యటన రక్తసిక్తమైంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రనేతను అడ్డుకున్న తెలంగాణ వాదులను పోలీసులు చితకబాదారు. సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడికి పాల్పడిన తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. తెలంగాణ వాదులను అణచివేయడానికి ఇది తమకు మరోసారి లభించిన అవకాశంగా వారు అత్యుత్సాహం ప్రదర్శించారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. వేలాదిగా పోలీసుల ఉన్నా తెలంగాణ వాదులు వెరవలేదు. రెట్టింపు ఉత్సాహంతో సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. పోలీలసులు తెలంగాణవాదులను అరెస్టు చేసి స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ లాఠీఛార్జీలో ఎంతోమంది తెలంగాణ వాదుల తలలు పగిలాయి

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.