సీఎం వత్తాసు పలకడం సరికాదు:భిక్షమయ్య

హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగులకు, ప్రజలకు సీఎం వత్తాసు పలకడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియకు ఆటంకం కలగొద్దనే ఏపీ ఎన్జీవోల సభకు సహకరించామని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణవాదులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఎన్జీవోల సభలో జై తెలంగాణ అన్నవారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్జీవోల సభ రోజు జరిగిన పరిణామాలన్నింటినీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.