సీఎం బస్సుపై తెలంగాణవాదుల రాళ్లదాడి

వరంగల్: జిల్లా ప్రజలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మరోసారి రాయినిగూడెంను గుర్తు చేశారు. జిల్లాలో ఆయనకు అడుగడుగున నిరసనలు తెలుపుతున్నారు. హన్మకొండలో సీఎం ప్రయాణిస్తున్న బస్సుపై పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు రాళ్లు రువ్వారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై సీఎం కిరణ్ స్పష్టమైన వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన సీఎంకు కాకతీయ ఉత్సవాలను ప్రారంభించే అర్హత ఆయనకెక్కడిదని నిలదీశారు. ఇవి కాకతీయ ఉత్సవాలు కాదని, కిరణ్‌కుమార్ ఉత్సవాలని వారు విమర్శిస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.