సీఎం ప్రాంతీయవాదిలా మాట్లాడుతున్నాడు: మందా

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై మాట మార్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం ఫైర్ అయ్యారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఒక ప్రాంతీయ వాదిలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పి ఇప్పుడు కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చుకుంటూ మరోసారి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణపై పార్టీలు మాట మార్చడం సరికాదని అన్నారు. సీమాంధ్ర ఉద్యమాన్ని కొందరు పెట్టుబడిదారులు నడిపిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.