హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలను అడ్డుకునే బాధ్యత టీ మంత్రులదేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు సూచించారు. సీఎం కిరణ్ బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జీవోఎంకు తప్పుడు రిపోర్టులు ఇచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కిరణ్ సీఎం పదవిలో ఉండి తప్పుడు రిపోర్టులు పంపడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై జరిగినన్ని చర్చలు ఏ రాష్ట్ర ఏర్పాటులో జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణపై అనేక చర్చలు జరిగినప్పటికీ విభజన నిర్ణయం అప్రజాస్వామికం అనడం అవివేకమే అని అన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మాటలు దిగజారుడు తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలతోనే తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కేసీఆర్ పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టిన్రు, అయినా తెలంగాణ ఉద్యమం ముందుకు పోతుందని చెప్పారు.
సీఎం కుట్రలను అడ్డుకునే బాధ్యత టీ మంత్రులదే:కేకే
Posted on October 21, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.