సీఎం కిరణ్ వ్యాఖ్యలు అప్రజాస్వామికం, చట్టపరంగా ప్రొసీడ్‌ అవుతం- కేసీఆర్

తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వనని సీఎం కిరణ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. కిరణ్ కేవలం సీమాంధ్రకే ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలతో ప్రస్తావిస్తానని తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ కోసం మద్దతు ఇచ్చే పార్టీలో మాట్లాడతానని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ టీడీపీ ఎప్పుడో చచ్చిపోయింది
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పుడో చచ్చిపోయిందని కేసీఆర్ తెలిపారు. ‘ఇప్పుడున్నదంతా సన్నాసుల టీడీపీ’ అన్నారు. టీడీపీ నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆవేదనతో అన్నారు. అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం మద్ధతు ఇవ్వడమన్నది ప్రపంచంలో ఇదే ప్రథమం అని కేసీఆర్ తెలిపారు. అసలు అవిశ్వాసాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడపీ ప్రవేశ పెడుతుందనుకున్నమని, కానీ అలా చేయకపోవడంతో తమతో అయినా కలిసి వస్తుందని అవిశ్వాసం పెట్టామని తెలిపారు.

ఏప్రిల్‌లోగా తెలంగాణపై తేలిపోతది: కేసీఆర్
యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో ఏప్రిలో మొదటి వారంలోగా తేలిపోతదని కేసీఆర్ అన్నారు. ఇక అవిశ్వాసంపై ఓటు వేయకపోవడం అన్నది ఎంఐఎం నేతలకే వదిలివేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో తెలంగాణకు అనుకూలురైన శరద్‌పవార్, ఇతర పార్టీల నేతలతో తెలంగాణ ఏర్పాటుపై చర్చిస్తానని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.