సీఎం కిరణ్ రచ్చబండను అడ్డుకుంటాం: హరీష్

కరీంనగర్: తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ పేరుతో తెలంగాణలో ఎలా పర్యటిస్తారో చూస్తామని టీఆర్‌ఎస్ హెచ్చరించిందతెలంగాణలో సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏ ముఖం పెట్టుకుని సీఎం తెలంగాణలో పర్యటిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సీఎం రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కిరణ్‌కు సహకరిస్తే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ రైతాంగంపట్ల సీఎం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఇదే సీఎం సీమాంధ్ర ఉద్యమం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేశారని గుర్తు చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.