సీఎం కిరణ్.. మీ స్థాయి ఏంటి?:కేటీఆర్

హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ఒక ప్రాంత నాయకుడు అయితే, మీ స్థాయి ఏంటి అని ప్రశ్నించారు. కేసీఆర్ స్థాయి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అని తెలిపారు. ఒక ఎమ్మెల్యే మద్ధతు లేకుండా సీల్డ్‌కవర్‌లో పదవి తెచ్చుకున్న అర్భకుడివి నువ్వు అని సీఎంపై మండిపడ్డారు. రాయ్‌బరేలీ, అమేథీలో మీ నేతలు కనీసం ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాము కేసులకు, జైళ్లకు భయపడమని తేల్చిచెప్పారు.

ఉండవల్లిపై ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ : ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. ఉండవల్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ భాష ప్రజలకు అర్థమయ్యే భాష అని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ నాన్చుడి ధోరణి అవలంబిస్తే పదేపదే తిడుతామని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు ఉంటే సీమాంధ్రుల అపోహాలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ కావాలంటే దేశం మొత్తం ఒప్పుకోవాలని ఉండవల్లి అనడం సరికాదన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఉండవల్లి ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో 42 పార్టీలకు గానూ 36 పార్టీలు తెలంగాణకు మద్ధతు ఇచ్చాయని, దీనిపై ఉండవల్లి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఉండవల్లికి రాజ్యాంగం తెలియదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.