సీఎం కిరణ్‌.. నీకు అంత మదమెందుకు?-కేసీఆర్

 

KCR-KNR-అది ఎవడబ్బ సొమ్ము? నీదా? నీ అయ్యదా?
-జూలపల్లి సభలో సీఎంపై కేసీఆర్ నిప్పులు
‘శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వ.. ఏమి చేసుకుంటారో చేసుకో అంటున్నాడు. ముఖ్యమంవూతిని నేను అడుగుతున్నాను. డబ్బులు ఇవ్వనని చెప్పడానికి నువ్వు ఎవరు? అది ఎవడబ్బ సొమ్ము? నీదా? నీ ఆయ్యదా? ఇంత మదం ఎందుకు? అలా మాట్లాడేందుకు నీకు ఎంత ధైర్యం? ఇంత అహంకారం ఎందుకు? తెలంగాణలో ఎవడూ అడిగే వాడు లేడనుకుంటున్నావా? అంటూ టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా జూలపల్లిలో గురువారం బహిరంగ సభ జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జిల్లా ఆధ్యక్షుడు ఈద శంకర్‌డ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘2011-12 లో రాష్ట్రానికి చేకూరిన ఆదాయంలో రూ.39,900 కోట్లు తెలంగాణనుంచి రాగా కేవలం 13,178కోట్లు సీమాంధ్ర నుంచి వచ్చాయి. తాజాగా 62వేల కోట్ల ఆదాయం వస్తే అందులో 47వేల కోట్లు తెలంగాణ నుంచే వచ్చాయి’ అని కేసీఆర్ చెప్పారు. ‘మా ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం తీసుకొని, మాకే పైసా ఇవ్వనంటావా? అంటూ సీఎంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తెగేసి చెపితే తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మూతి మూసుకొని దద్దమల్లా చెవులూపారే తప్ప ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. సీఎంను చూస్తేనే కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇటువంటి దద్దమ్మలను మళ్లీ గెలిపించాలా? చవటలు, సన్యాసులకు మళ్లీ ఓట్లు వేస్తారా? అని అన్నారు. 

దశాబ్దాలుగా జలాలు, వనరులు, ఉద్యోగాల దోపిడీ జరుగుతున్నా ఇంకా ఆంధ్రా పార్టీలు తెలంగాణ గడ్డపై అవసరమా? సీమాంధ్ర నాయకుల పాలనలో బతుకుదామా? లేక స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి శాసించి తెలంగాణ తెచ్చుకుందామా? తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలు తెలివిగా వ్యవహరించాల్సిన తరుణం వచ్చిందని చెప్పారు. అందుకే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి శిక్షణాశిబిరం గురువారం జరిగింది. ఈ కార్యక్షికమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఇక్కడి ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందన్న అంశాలను కేసీఆర్ వివరించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్నట్లు కులాలవారీగా హాస్టల్స్ ఉండవని, నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక స్టేట్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల సంఖ్య అధారంగా ప్రతి మండలానికి నాలుగైదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటాయని, వీటిని చిన్నపాటి విశ్వవిద్యాలయాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ‘పా వసతి గృహాల్లో ఒక్కో గదిలో నాలుగు నుంచి ఆరుగురు విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దుస్తులు, పుస్తకాలు, యూనిఫారాలు, నాణ్యమైన భోజనం అన్నీ ఉచితమే. వారానికోమారు వైద్య పరీక్షలు చేయించి, అవసరాన్ని బట్టి చికిత్స చేయిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీల పిల్లలు చదువుతున్న ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలుంటాయి’ అని కేసీఆర్ చెప్పారు. సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతామని చెప్పారు. ‘బడి ఈడు పిల్లలంతా బడి బయట ఉండటానికి వీలులేకుండా చట్టాన్ని తీసుకొస్తాం. దీని అమలు బాధ్యతను పోలీసులకు అప్పగిస్తాం. తద్వారా పోలీసులు సైతం సామాజిక సేవల్లో పాలు పంచుకున్నట్లవుతుంది. పోలీసులంటే ప్రస్తుతం ఉన్న భయం కూడా పోతుంది. భవిష్యత్తు తెలంగాణలో ఉచిత నిర్భంధ విద్యాపథకం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది’ అని చెప్పారు. ఈ పథకానికి తానే సొంతగా రూపకల్పన చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

రూ.2 లక్షలతో ఇళ్ల నిర్మాణం 
బలహీనవర్గాలకు పక్కా ఇళ్లు నిర్మాణం కట్టిచ్చామని కాంగ్రెస్, టీడీపీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ.. అవి కుక్క గూళ్లకన్నా ఆధ్వాన్నంగా ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. ఈ పార్టీలు కట్టించిన పక్కా గృహాలు సౌలభ్యంగా ఉన్నాయని భావిస్తే.. మంత్రులు ఒక్క నెలరోజులు వాటిలో గడపాలని ఆయన సవాలు విసిరారు. అప్పుడే ఆ ఇళ్లలో ఎన్ని లోపాలు ఉన్నాయో వారికి తెలిసి వస్తుందని అన్నారు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి 400 చదరపు గజాల స్థలంలో రూ.ండు లక్షల ఖర్చుతో అందమైన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రెండు బెడ్‌రూంలు, ఒకహాల్, ఒక కిచెన్ ఉండే విధంగా నిర్మాణం ఉంటుందని అన్నారు. బలహీనవర్గాలు తల ఎత్తుకొని బతికేలా ఈ నిర్మాణాలు ఉంటాయన్నారు.

21 లక్షల మంది రైతులకు రుణ మాఫీ 
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తదుపరి తాను ఏ పదవినీ చేపట్టబోనని కేసీఆర్ చెప్పారు. ‘ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పదవులు అశించడు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తాడు’ అని పునరుద్ఘాటించారు. తెలంగాణకు తొలి సీఎం దళితుడేనని మరోసారి స్పష్టం చేశారు. గిరిజనులు, లంబాడీలకు 12%, ముస్లింలు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలుచేసి తీరుతామన్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు నెలకు రూ.1,500 పింఛన్ ఇచ్చి తీరుతామన్నారు. గ్రామాల వారీగా పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని, ఏ మాత్రం నష్టం వాటిల్లినా గ్రామాల వారీగా అదుకోవడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తెలంగాణలో 21 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారని, వీరిలో లక్షలోపు రుణాలు తీసుకున్న వారందరికీ రుణమాఫీ చేయాలంటే రూ.12వేల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రుణాలు మాఫీ చేసి ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటామన్నారు. దశాబ్దాలుగా జరిగిన దోపిడీయే కాకుండా ఇప్పుడు కూడా తెలంగాణ దోపిడీకి గురవుతున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్యాక్టరీకి బయ్యారం గనుల కేటాయింపే దీనికి నిదర్శనమన్నారు. బయ్యారంలోనే ప్యాక్టరీ ఏర్పాటుచేయాలని తాము డిమాండ్ చేస్తుంటే అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్స్‌లో సుమారు 35వేల మంది పనిచేస్తుంటే అందులో మూడువందల మంది కూడ తెలంగాణ వాళ్లు లేరన్నారు. అదే బయ్యారంలో ఏర్పాటుచేస్తే వేలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఐదేళ్లలో పదివేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన ప్లాంటులను ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పది జిల్లాల స్థానంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తద్వారా ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్యాలయాల్లోనూ కొత్తగా కొలువులు వస్తాయన్నారు.

ఆంధ్రా పార్టీలు అవసరమా?
‘ఆంధ్రా పార్టీలు తెలంగాణ గడ్డపై అవసరమా అన్న అంశాన్ని ప్రతి గ్రామంలోనూ చర్చకు పెట్టండి. వారి మోసాలను ప్రజలకు చెప్పండి. ఎన్నికలు రాగానే అగం ఆగం కావద్దు. ప్రలోభాలు పెట్టి గద్దెనెక్కడానికి వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. వాటి కుట్రలు కుతంవూతాల మీద దెబ్బ తీయాలంటే మన ఓటును టీఆర్‌ఎస్‌కు వేసి తీరాలి. అప్పుడే తెలంగాణ సిద్ధిస్తుంది’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాబోయేది సంకీర్ణ యుగమే. వంది మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలను మనం గెలుచుకుంటే.. శాశించి తెలంగాణ తెచ్చుకోవచ్చు. ఆ శక్తి మనకు వస్తోంది. కార్మికలోకం ఇప్పటికే ఆబాటలో పయనిస్తోంది. దీనికి నిదర్శనం సింగరేణి, ఆర్టీసీ, గ్రేటర్ హైదరాబాద్, జలమండలిలో గులాబీ జెండా ఎగురడమే. అంతేకాదు.. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు సైతం రగులుతున్న తెలంగాణ వైపు వచ్చారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు’ అన్నారు. ‘ఎన్నికల అనంతరం తెలంగాణ ఏర్పడబోతున్నది. అందులో టీఆర్‌ఎస్ అధికారంలోకి రానున్నది.

ఆ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ ఒక ఉన్నత స్థాయిలో కనిపిస్తారని అన్నారు. ఈ సమావేశంలో ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌డ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్‌డ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్‌ఎస్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీర్ల వెంక టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సిద్దం వేణు, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవిందర్‌సింగ్, జిల్లా అధ్యక్షురాలు రేవతిరావు, గాయకుడు దేశపతి శ్రీనివాసు, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: నిప్పులుకక్కిన కడియం 
తెలంగాణ ఏర్పాటుకు అది నుంచి అడ్డు పడింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 13ఏళ్లుగా టీఆర్‌ఎస్ ఉద్యమం నడిపిస్తుంటే.. కాంగ్రెస్, టీడీపీ కపట డ్రామాల వల్ల వేల మంది తెలంగాణ బిడ్డలు అత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. నోటి దాకా వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది ముందుగా చంద్రబాబేనని చెప్పారు. ‘2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడిన వెంటనే బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అర్ధరాత్రి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని, ఎవరి అభివూపాయాలు తీసుకోలేదని అడ్డు చెప్పారు.

టీడీపీ, కాంగ్రెస్‌లోని సీమాంధ్ర నాయకులను రెచ్చగొట్టి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయించడంలో బాబు కీలక పాత్ర పోషించారు’ అని కడియం మండిపడ్డారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఈ విషయంపై పార్టీ అంతర్గత సమావేశంలో ప్రశ్నించానని ఆయన వెల్లడించారు. 2009 ఎన్నికల తదుపరి తెలంగాణలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతు కావడంతో తెలంగాణ ప్రజలు కోరుకున్న బాటలో వెళదామని ఎంత చెప్పినా చంవూదబాబు వినలేదని కడియం తెలిపారు. టీడీపీ పక్షాన మాకు కార్యచరణ ఇవ్వండి.. మేం ఉద్యమం చేస్తాం అన్నా ఒప్పుకోలేదని చెప్పారు. పైగా తన పాదయావూతకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారని మండిపడ్డారు. భవిష్యత్తులో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలను నమ్ముకుంటే మరోసారి మోసపోతామని అన్నారు. అందుకే ఉద్యమ పార్టీకి ఓటువేసి తెలంగాణ అకాంక్షను సాధించుకోవాల్సిన తరుణం మన చేతుల్లోనే ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.