సీఎం కిరణ్‌ను గవర్నర్ భర్తరఫ్ చేయాలి: కేకే

అన్ని పార్టీలను సంప్రదించాకే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని కేకే తెలిపారు. సీమాంధ్ర నేతలు చరిత్ర తెలియకుండా ఇష్టమొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం, మంత్రులు సీఎం కిరణ్‌ను కుట్రదారుడన్నాక గవర్నర్ సుమోటో కేసుగా స్వీకరించి ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని కేకే డిమాండ్ చేశారు. అసలు రాజ్యాంగ విలువలపై గౌరవం ఉంటే సీఎం కిరణ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.