సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ

హైదరాబాద్ : సీమాంధ్ర దురహంకారంతో ప్రవర్తిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీనగర్‌లో కృష్ణా జలాల ఫేజ్-3 పనుల శంకుస్థాపన సభలో సీఎం ప్రసంగాన్ని తెలంగాణ వాటర్ వర్క్స్ కార్మికులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావును పిలకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. కార్మికులు నినాదాలు చేయడంతో సీఎం నివ్వెరపోయారు. ఆందోళన చేసిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.