సీఎం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డు: కేటీఆర్

అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులాగా సీఎం ఏమి చెప్పినా అసెంబ్లీకి బిల్లు రావడం లాంఛనం మాత్రమేనని, రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు ఓడించడం అనే ప్రసక్తి ఎక్కడిదని, రాష్ట్రపతి బిల్లును పంపింది కేవలం అభివూపాయాల వ్యక్తీకరణకు మాత్రమేనని ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబు, జగన్ వంటి నీతిమాలిన, అనైతిక రాజకీయ నాయకులు ఇక్కడే ఉన్నారని, ఈ విషయం కేంద్రంలోని పెద్దలకు కూడా తెలుసునని అన్నారు. పంజాబ్ విభజనను అప్పటి సీఎం రామ్‌కిషన్ ఇంతకంటే తీవ్రంగా వ్యతిరేకించినా, బీహార్ విభజనను లాలూవూపసాద్ వ్యతిరేకించినా చివరికి పార్లమెంట్ నిర్ణయమే సుప్రీం అని రుజువైందని కేటీఆర్ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.