సీఎంను పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలి: వివేక్

న్యూఢిల్లీ: తెలంగాణపై విషం చిమ్ముతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ వివేక్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతో ఇరు ప్రాంతాల మధ్య ఉధ్రిక్తత నెలకొందని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సీఎం కిరణ్‌ను పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకున్నాకా రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సీమాంధ్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకే సీఎం అలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

సీఎం, డీజీపీ తోడు దొంగలు: వివేక్
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి చిన్నప్పటి నుంచి తోడు దొంగలేనని వివేక్ విమర్శించారు. సీఎం ఎక్కడా గెలిచేవాడు కాదని, అన్నింట్లో ఓడిపోయే రకమని తెలిపారు. సీఎంది ఫేల్యూర్ లైఫ్ అని, స్కూళ్లో టెన్నిస్‌లో తనతో ఓడిపోయేవాడని వివేక్ అన్నారు. రాష్ట్ర విభజనపై కిరణ్ తొండాట ఆడుతున్నాడని విమర్శించారు. చిన్నప్పటి నుంచి కిరణ్ తన బుద్దిని మార్చుకోలేదని విమర్శించారు. కేంద్రం నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు వ్యతిరేకించడం తగదన్నారు. సీఎంకు అవగాహాన, నాలెడ్జ్‌లేదని ఎద్దేవా చేశారు. తెలిసినట్టు నటిస్తారని, కానీ ఏమీతెలియదని తెలివి శూన్యమని విమర్శించారు. సీఎం సీమాంధ్రకే సీఎంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే అధిష్ఠానం విభజన నిర్ణయం తీసుకుందని తీరా ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.