సీఎంకు హరీష్‌రావు సవాల్

తెలంగాణకు విద్యుత్ సరఫరాలో అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా అని హరీష్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణకు ఏడు గంటలు సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సీఎం నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు సరిగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, కోస్తాంధ్రలో ఉన్న ఎస్‌పీడీసీఎల్ పరిధిలో కేవలం 2 ఫీడర్లకు మాత్రమే 7 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు. అక్కడ ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేసి తెలంగాణలో కనీసం నాలుగైదు గంటలు కూడా సరఫరా చేయడం లేదని తెలిపారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.