సీఎంకిరణ్ శాడిస్టులా వ్యవహరిస్తున్నాడు: వీహెచ్

న్యూఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. సీఎం శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తీరుతో రెండు ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరిగేలా ఉందని అన్నారు. ఈనెల 21 నుంచి మెదక్ జిల్లాలో కృతజ్ఞత యాత్ర నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా నేతలు దష్టిపెట్టాలని రాహుల్ చెప్పారని అన్నారు. తెలంగాణ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని వీహెచ్ విమర్శించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.