సీఎంకిరణ్,దినేష్‌రెడ్డి,సీఎంతమ్ముడిపై పిటిషన్

హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, సీఎం తమ్ముడు ఎన్. సంతోష్‌రెడ్డిపై విచారణ జరిపించాలని ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి పదవిలో ఉండగా అధికార దుర్వినియోగనికి పాల్పడ్డ్డారని, సీఎం కిరణ్ తమ్మడు సంతోష్‌రెడ్డి భూ దంధాలకు పాల్పడ్డాడని, సీఎం కిరణ్ డీజీపీని అడ్డుపెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేశారని పిటిషనర్ న్యాయవాది నరేష్ పేర్కొన్నాడు. 120(బి), 119, 166, 180 సెక్షన్ల కింద పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.