సినీనటుడు మహేశ్‌బాబుపై కేసు నమోదు

మహేశ్ విస్కీ ప్రకటన చూసి తాగి నష్టపోయానని ఫిర్యాదు
మద్యం తాగితే సూపర్ స్టార్ అవుతారంటూ హీరో మహేష్‌బాబు ఓ ప్రకటనలో పాల్గొనడంపై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది. నడిగూడెం మం డలం పరిధిలోని తెల్లబల్లికి చెందిన తూము సతీశ్‌కుమార్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ‘మా నాన్న రాయల్‌స్టాగ్ లార్జ్‌పెగ్ ఇస్తే, నేను తాగి సూపర్ స్టార్ అయ్యానని రాయల్ స్టాగ్ విస్కీ ప్రకటనలో మహేశ్‌బాబు చెప్పాడు. ప్రకటనలో ఎక్కడా మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిక చెయ్యలేదు. ఆ ప్రకటన స్ఫూర్తితో నేను పెగ్గు మీద పెగ్గు తాగినా సూపర్‌స్టార్ కాలేకపోయాను. యాడ్ కారణంగా ప్రభావితమై బాగా తాగి ఉద్యోగ ప్రకటనల ఇంటర్వ్యూలకు హాజరుకాలేకపోతున్నాను. పైగా ఆరోగ్యం క్షీణించింది. ఈ ప్రకటనలో నటించిన మహేశ్‌బాబు, రాయల్‌స్టాగ్ విస్కీ యాజమాన్యంపై, డిస్టిబ్యూటర్‌పై కేసు నమోదు చేసి చర్య లు తీసుకోవాలి’అని సతీశ్‌కుమార్ ఫిర్యాదులో కోరాడు. కేసు నమోదు చేశామని, కోర్టు ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటామని ఏఎస్‌ఐ సలీం తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.