సినిమా రంగాన్ని కమ్మేసిన వంశవృక్షం

అనగనగా ఒక సామ్రాజ్యం! దానికి కొంతమందే రాజులు! ఆ రాజులకు కొడుకులు.. ఆ యువరాజులే రాబోయే కాలానికి కాబోయే రాజులు! వారికి పుట్టే పిల్ల యువరాజులే.. భావితరానికి రాబోయే రాజులు! రాజ్యంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం! ఒకరిద్దరు లోనికి ప్రవేశించినా.. ఎందుకు వచ్చామనుకోవాల్సిందే తప్ప.. సాధించేది పెద్దగా ఏమీ ఉండదు! ఏదైనా సాధించేందుకు ప్రయత్నం చేసినా.. రాజుల వందిమాగధులు.. దండనాయకులు కన్నెర్ర చేస్తారు! ఆ సామ్రాజ్యం పేరు తెలుగు సినిమా రంగం!

bommaaఒకప్పుడు రాజరికాల్లో వారసత్వాలుండేవి. పుస్తకాల్లో చదువుకున్నాం! రాజరికాలకు ఆనవాళ్లు మిగిలిపోయిన భూస్వామ్య వ్యవస్థలో ఆస్తుల వారసత్వాలు వచ్చాయి. ప్రత్యక్షంగా చూశాం! ఇప్పుడు సినీ రంగంలో మొలుస్తున్న వంశ వృక్షాలు. వెండితెరపై గమనిస్తున్నాం!! ఇప్పుడు సినిమారంగంలో వారిదే హవా! హీరో అవ్వాలంటే టాలెంట్ ఉండాలనేది ఒకప్పటి మాట! సక్సెస్ కోసం కష్టపడాలనేది ఎప్పుడూ విన్న మాట! హీరో అన్నాక చార్మింగ్ పర్సనాలిటీ కావాలనేది ఉత్తిమాట! వంశంలో హీరో ఉంటే చాలు! దర్శకుడైనా ఫర్వాలేదు! నిర్మాత అయితే ఢోకాలేదు! చాన్సులు వెతుక్కుంటూ వస్తాయి! కొందరు మాత్రం టాలెట్ నిరూపించుకున్నారు! కొందరు ఇతర అంశాలు ఆసరా చేసుకుని.. ఎదిగారు! సినిమాను తానే నడిపించే సత్తా ‘బాబు’కు లేకపోతే.. గ్లామరస్‌డాల్స్ వయ్యారాలు ఒలకబోస్తాయి! బలమైన కథలు హీరో ఇమేజ్‌ను శిఖరాక్షిగానికి ఎత్తేస్తాయి! నేపథ్య సంగీతాలు.. కళ్లు తిరిగే సెట్టింగులు.. బ్లూస్క్రీన్ మాయలు! ఫుల్ మేకప్! యాక్షన్… కట్.. పేకప్..! డాల్బీ డిజిటల్ సౌండ్‌లో థియేటర్లకు పారే సెవెంటీ ఎంఎం రీళ్ల వరద! కొత్తగా అవకాశాలు రావాలంటే ఈ వరద హోరులో ఈదాలి! ‘ఇది ఇలాగే ఎందుకు ఉండాలి?’ అని ఆలోచించినవారు కొందరు ఈదే ప్రయత్నం చేశారు! కొందరు మునిగిపోయారు.. కొందరికి చేతులు కాలాయి.

కాసులు మాత్రం రాలలేదు! హీరో సంగతి సరే..! టాలెంట్ చూపించి.. మెగాఫోన్ పట్టుకుని.. ‘యాక్షన్’.. అని చెబుదామనుకున్నవారిది మరో కష్టం! ఢక్కాముక్కీలు తిని.. రెండు మూడు డజన్ల సినిమాలకు క్లాప్‌లు కొట్టుకుంటూనో.. స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతూనో! ఎవరో మహానుభావుడు దయతలిస్తే డిస్కషన్ స్థాయికి ‘లైన్’! ఆ లైన్ స్క్రిప్ట్‌గా మారి..సినిమాగా తయారై.. విడుదలయ్యాక.. విజయం గాల్లో దీపమే! ఇప్పుడు సినిమా రంగంలో కొత్త కళాకారులకు ఎంట్రీపాస్ దొరకాలంటే సాదాసీదా వ్యవహారం ఏమీ కాదు! అంతలా ఎదిగింది సినీ వంశోధారకులనే మర్రిచెట్టు! 80వ దశకం! తరం మారిన సమయం! అప్పటికే కొన్ని చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు వేసినా.. సినీ హీరోల వారసులు రంగ ప్రవేశం చేసింది ఈ దశకంలోనే! నటరత్న ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ యువరత్నగా వచ్చాడు. మరో కుమారుడు హరికృష్ణ లేటు వయసులోనూ హీరోననిపించాడు. అప్పటికే ఎన్టీఆర్ తమ్ముడి కొడుకు కల్యాణ్‌చక్షికవర్తి పల్లెటూరి యువకుడిగా.. లవర్‌బాయ్‌గా తెరకెక్కాడు. కృష్ణ కొడుకు రమేష్‌బాబు వచ్చినా.. మధ్యలోనే వెళ్లిపోయాడు.

నట సమ్రాట్ తనయుడు నాగార్జున యవ సమ్రాట్ అయ్యాడు. నిర్మాత రామానాయుడు కుమారుల్లో ఒకరు యాంగ్రీ యంగ్‌మెన్ వెంక హీరో అయితే.. మరో తనయుడు సురేశ్‌బాబు నిర్మాతగా మారాడు. అల్లురామలింగయ్య తనయుడు అరవింద్ నిర్మాత అయ్యారు. వీబీ రాజేంవూదవూపసాద్ వారసుడు జగపతిబాబు తెరంగేట్రం! 90దశకం దాటాక మరో తరం! కృష్ణ తనయుడు మహేష్ కొత్త సూపర్ స్టార్! అరవింద్ కొడుకు అర్జున్.. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ కొత్త మెగాస్టార్! కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తనయులు విష్ణు.. మనోజ్.. హరికృష్ణ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్.. కళ్యాణ్‌రామ్! నందమూరి వంశ మరో వారసుడు తారక్! కృష్ణం రాజు సోదరుడి తనయుడు ప్రభాస్.. నాగార్జున తనయుడు నాగ చైతన్య.. నాగేశ్వర్‌రావు మనవళ్లు సుమంత్.. సుశాంత్. నిర్మాత సురేష్ తనయుడు రాణా.. ఇదో అంతులేని కథ! ఇప్పుడు హీరోలు వారసులే! ఒకరిద్దరు మినహాయిస్తే.. అందరూ ఒకే సామాజికవర్గం. కోస్తా మిగులు సంపదతో సినీ రంగాన్ని గుప్పిటపట్టి.. ఇప్పటికీ పట్టుసడలించని వంశాల ఉద్ధారకులు!

DSC-Grand-Test

This entry was posted in ARTICLES.

Comments are closed.