సినిమాల్లో అచ్చా.. రోడ్లపైకి వస్తే లుచ్చా

– హీరో రాంచరణ్ దౌర్జన్యం
– కారు అడ్డుతీయలేదని ఇద్దరిపై తీవ్రంగా దాడి
– పదినిమిషాలు రోడ్డుపై వీరంగం
– ఫిర్యాదుకు వెళ్లిన బాధితులు
– పోలీసుల ఒత్తిడితో మాటమార్పు
సినిమాల్లో హీరోయిజాన్ని ప్రదర్శించే హీరో రాంచరణ్ నడిరోడ్డుపై రచ్చరచ్చ చేసి జులుం ప్రదర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్1లోని జీవీకే మాల్ ఎదురుగా సినీ ఫక్కీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు వ్యవరించిన తీరుపై విమర్శలు వెల్లు కొండాపూర్‌లో నివాసం ఉండే ఫణీష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన స్నేహితుడు కళ్యాణ్‌తో కలిసి కారు (ఏపీ9 ఏజే 73cc9)లో బంజారాహిల్స్ నుంచి పంజాగుట్టవైపు వెళ్తున్నారు. జీవీకే మాల్ వద్ద సిగ్నల్ పడటంతో ఫణీష్ కారును నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి తన కారులో వచ్చిన హీరో రాంచరణ్.. కారును అడ్డు తీయాలంటూ హారన్ మోగించారు. సిగ్నల్ లేక ఫణీష్ కారును తీయకపోవడంతో ఆగ్రహించిన రాంచరణ్ సిగ్నల్ పడగానే కారును ఓవర్ చేసి రోడ్డుకు అడ్డంగా నిలిపారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఫణీష్‌పై దాడి చేయడంతోపాటు తన ప్రైవేటు సెక్యూరిటీని పిలిపించారు. ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ.. వచ్చీ రావడంతోనే ఫణీష్, కళ్యాణ్‌లపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పది నిమిషాలపాటు నడిరోడ్డుపై వీరంగాన్ని సృష్టించిన రాంచరణ్ తన అనుచరులతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

దీంతో తీవ్రంగా గాయపడిన బాధితులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. సంఘటన జరిగిన స్థలం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారిని పంజాగుట్ట పోలీసులు తమ వాహనంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకు ఈ విషయం తెలిసి అప్పటికే పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న మీడియాతో మాట్లాడిన బాధితులు తమను రాంచరణ్, అతని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా కొట్టారని చెప్పారు. ముఖం, శరీరంపై ఉన్న గాయాలను చూపించారు. కళ్యాణ్ కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో ఆయన స్నేహితుల సహాయంతో పోలీస్టేషన్‌కు వెళ్లారు.

రెండుగంటలపాటు వీరిద్దరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ, ఏసీపీ శంకర్‌డ్డిలతో మాట్లాడారు. బాధితులపై పై స్థాయి నుంచి బెదిరింపులు, ఒత్తిడి రావడంతో ఇది ఆవేశంలో జరిగిన ఘటన అని, తాము రాంచరణ్‌పై ఫిర్యాదు చేయడంలేదంటూ వెళ్ళిపోయారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల శరీరంపై స్పష్టంగా గాయాలు కనిపిస్తున్నా కేసు నమోదు చేయకుండా పోలీసులు ఒత్తిడిచేశారని తెలుస్తోంది. గాయపడ్డ కళ్యాణ్ నడవలేని స్థితిలో ఉండగా అతడి స్నేహితులు పోలీస్‌స్టేషన్ నుంచి ఎత్తుకుని తీసుకెళ్లారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.