సిద్దరామయ్యకే… సీఎం పట్టం

 

Siddaramaiah
రహస్య బ్యాలెట్‌తో సీఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
– ప్రకటించిన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ
– కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వీడిన సస్పెన్స్
– కంఠీరవ స్టేడియంలో సోమవారం ఉదయం 11గంటలకు ప్రమాణం
కర్ణాటక కొత్త ముఖ్యమంవూతిగా సిద్దరామయ్య ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ పంపిన రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సారథ్యంలోని బృందం శుక్రవారం సాయంత్రం ఎన్నికైన 121 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభివూపాయాల్ని రహస్య బ్యాలెట్‌తో సేకరించగా.. బలహీన వర్గాలకు చెందిన 64యేళ్ల సిద్దరామయ్యకే అత్యధిక మద్దతు లభించింది. దీంతో ఆయన సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైనట్లు ఆంటోనీ ప్రకటించారు. సోమవారం ఉదయం 11గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంవూతిగా ప్రమాణం చేయనున్నారు. ఆంటోనీ ప్రకటన అనంతరం సిద్దరామయ్య కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జీ పరమేశ్వర, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మధుసూదన్ మిస్త్రీలతో కలిసి రాజ్‌భవన్ వెళ్లి సీఎల్పీ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌కు వివరించారు. ఈమేరకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి సిద్దరామయ్య ఆహ్వానం అందుకున్నారు. ‘సీఎంగా నియమిస్తూ.. గవర్నర్ నాకు లేఖ అందించారు’’ అని రాజ్‌భవన్ వద్ద సిద్దరామయ్య విలేకరులకు తెలిపారు. కాగా, సిద్దరామయ్య, పరమేశ్వరలిద్దరూ ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీతో మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తారని సమాచారం. ముఖ్యమంత్రి ఒక్కరే ప్రమాణం చేస్తారని.. మంత్రివర్గానికి సోనియా ఆమోదం పొందాక మంత్రుల ప్రమాణస్వీకారాలు ఉంటాయని పరమేశ్వర సంకేతాలిచ్చారు.

విజయసారధి.. సిద్దరామయ్య
అధికార పీఠానికి ఏడేళ్లుగా దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష నేతగా సిద్దరామయ్య విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన కాంగ్రెస్ గెలుపునకు కృషిచేసి.. విజయసారధిగా నిలిచారు. బలహీన వర్గనేతగా రాష్ట్రంలో మాస్ ఇమేజ్ సాధించుకున్నందుకే.. మహామహుల్ని కాదని కాంగ్రెస్ హై కమాండ్, ఎన్నికైన ఎమ్మెల్యేలు సిద్దరామయ్యకు పట్టం కట్టారు. కాగా, సిద్దరామయ్య ఆరేళ్ల క్రితం జేడీ-ఎస్‌నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ధరంసింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. సీఎంగా సిద్దరామయ్యను హైకమాండ్ ఎన్నికలకు ముందే ఎంపిక చేసిందని ఊహాగానాలు చెలరేగినా.. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి ఆయన చాలానే కష్టపడ్డారు. కొద్దికాలం కిందటే పార్టీలోకి వచ్చిన సిద్దరామయ్యను సీఎంగా కొన్ని వర్గాలు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో అందరి మద్దతుతోనే సీఎం ఎంపిక చేశామని చెప్పడానికే హైకమాండ్ రహస్య బ్యాలెట్ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం అభ్యర్థిత్వంపై ఇద్దరినుంచి భారీ పోటీ వస్తుండటంతో.. ఏఐసీసీ బృందం శుక్రవారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలనుంచి వ్యక్తిగత అభివూపాయ సేకరణ చేపట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య సీఎల్పీ నాయకుడి ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వదిలేయాలని ప్రతిపాదన తెచ్చారు. దీనిని అంగీకరించని అధిష్టానం రహస్య బ్యాలెట్ నిర్వహించాలని ఏఐసీసీ బృందానికి సూచించింది. ఈమేరకు నిర్వహించిన రహస్య ఎన్నికల్లో ప్రత్యర్థి ఖర్గేపై సిద్దరామయ్య ఘన విజయం సాధించారు. దీంతో సీఎంగా ఆయన పేరును ఏకే ఆంటోనీ ఖరారు చేశారు. ఏఐసీసీ బృందంలో రక్షణమంత్రి ఏకే ఆంటోనీ, లూసియానో ఫెలెరో, కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మధుసూదన్‌మిస్త్రీ, కేంద్రసహాయ మంత్రి జితేందర్ సింగ్ ఉన్నారు. అనంతరం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఏకపక్షంగా తన ఎన్నిక జరగలేదని.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని వెల్లడించారు. ఎమ్మెల్యేలు రహస్యబ్యాపూట్‌తో తనను ఎన్నుకున్నారని చెప్పారు.

నెరవేరిన కల..: ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి కావాలన్న కల నెరవేరింది. సిద్దరామయ్యకు సీఎం పీఠం దక్కనివ్వమని.. అధికారంలో ఉన్నప్పుడు కమలనాథులు చేసిన సవాళ్లను ప్రజాపోరాటాలతో చిత్తుచిత్తు చేశారు. సీఎంగా ఎన్నికై అందరి అంచానాలను తలకిందులు చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ఓటమి అయాచిత వరంలా మారింది. రాష్ట్రంలో మూడో అతి పెద్ద సామాజిక వర్గమైన కురుబకు చెందిన సిద్దరామయ్య.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వ్యాఖ్యలతో బీజేపీ ప్రభుత్వాన్ని బెంబేపూత్తించారు. దేవెగౌడ ప్రధానిగా ఎన్నికైనప్పుడు జేడీఎస్‌లో ఉన్న సిద్దరామయ్యకు అందుతుందనుకున్న సీఎం పదవి తృటిలో తప్పింది.

సిద్దరామయ్య ప్రస్థానం..
1948, ఆగస్టు 12, సిద్దరామనహుండి, వరుణహొబ్లి, మైసూర్ జిల్లాలో జన్మించారు. న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేపట్టారు. 1978లో మైసూర్ తాలుకా బోర్డుకు ఎన్నిక కావడంతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1983లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి భారతీయ లోక్‌దళ్ పక్షాలన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అధికార జనతాపార్టీలో చేరారు. 1985లో ఉప ఎన్నికలో విజయం సాధించి.. పశుసంవర్ధక శాఖమంవూతిగా బాధ్యతల స్వీకరించారు.1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. 1992లో జనతాదళ్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో జేహెచ్ పటేల్ సారథ్యంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అదే సమయంలో జనతాదళ్ రెండుగా చీలడంతో జేడీ-ఎస్‌లో చేరారు. దేవెగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో.. ఆ పార్టీ రాష్ట్రశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.2004లో కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.దేవెగౌడతో విభేదాలు రావడంతో.. 2006లో కాంగ్రెస్‌లో చేరారు. చాముండేశ్వరి ఉప ఎన్నికల్లో గెలుపు. 2008, 2013ల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.కాగా, సిద్దిరామయ్య సీఎంగా బాధ్యతలు చేపడితే.. కర్ణాటకకు 22వ ముఖ్యమంత్రి కానున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.