సింగిల్ బైట్ తో బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన సుష్మాకు ధన్యవాదాలు

వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తూ తెలంగాణపై కుట్రలు చేస్తున్నరు. ఇంటర్నల్ గా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలంటే తెలంగాణ ప్రజల నుంచి బీజేపీపై ఒత్తిడి తేవాలని గుర్తుచేసినవ్.. అందుకు మంచి అవకాశం కల్పించినవ్.. బీజేపీపై ప్రెషర్ పెంచేలా చేసినవ్..
అటు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలతో, సీఎంతో డ్రామాలాడించడాన్ని ఎండగట్టినవ్.. సొంతపార్టీ సీఎం బిల్లును తిరస్కరిస్తే ఏం చేయలేకపోయారని.. కాంగ్రెస్ రేపు సీమాంధ్ర ఎంపీలు పోడియం ముందు ధర్నా చేయిస్తదని ఎండగట్టినవ్.. ఈ డ్రామాలను కట్టిపెట్టి తెలంగాణ బిల్లు పెట్టాలని.. బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతిస్తదని చెప్పినవ్..
నీ ఎదురుదాడితో కాంగ్రెస్ రేపు సీమాంధ్ర ఎంపీల సమావేశం పెట్టింది.

సుష్మక్కో.. కాంగ్రెస్ కు ధమ్కీ ఇవ్వు ఫర్లేదు.. కానీ వాళ్లకు బిల్లు పెట్టకుండా చేసే అవకాశం ఇవ్వకక్కో.. నీకు దండం పెడ్తం..
బీజేపీ అంతా సీమాంధ్ర దిక్కుంటే నువ్వొక్కదానివే తెలంగాణ దిక్కున్నవ్.. అసలు తెలంగాణ ఇంత దూరం రావడానికి నువ్వు కూడా ఒక కారణమే.. బిల్లు పాసయ్యేదాక మాదిక్కే ఉండక్కా….. ఈ ఐదు రోజులు మమ్మల్ని ఇట్లనే అలర్ట్ చెయ్యి అక్కా..

This entry was posted in ARTICLES.

Comments are closed.