సాలరీ ప్లీజ్!

సామాన్యుడి ఆరోప్రాణం ఏమోకానీ ముందు మా ప్రాణం కాపాడండి.. ఓనర్ రెంట్ అడుగుతున్నడు. పాల వాడు, కిరాణం వాడు డబ్బులడుగుతున్నడు. మీకు పుణ్యముంటది.. జీతం ఇవ్వండి ప్లీజ్.. అని 6టీవీ ఉద్యోగులు బ్రతిమిలాడుకుంటున్నరు.  ప్రతినెల ఒకటో తారీఖు వరకే వచ్చే జీతం ఈ నెల 9వ తారీఖు వచ్చినా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నరు.. గత ఐదురోజులుగా వాళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నప్పటికీ 10వ తేదీలోగా వేస్తారేమోనని రాయకుండా ఆగిన.

జీతం అడిగితే ఏవేవో కారణాలు చెప్తున్నరట.  ఇప్పుడు సోమవారం దాకా ఆగాలంటున్నరట. కారణాలేవైనా మరీ సోమవారం దాకా ఆగితే ఉద్యోగులు అవస్థలు పడ్తరు.. ఎన్నికల సీజనే కదా.. రేపో, ఎల్లుండో అడ్జస్ట్ చేయండి బాసూ..

వేరే చానల్ కు వెళ్దామని ప్రయత్నిస్తున్నవారికి అడ్డంపడుతున్నరట. ఎక్స్ ప్రెస్ న్యూస్, టీవీ8లో సమర్పించిన రెస్యూమ్ ల లిస్ట్ 6టీవీలో తేలుతుందట. ఎందుకు వెళ్తున్నరని 6టీవీ హెడ్స్ అడుగుతున్నరట. అమ్మ పెట్టదు.. అడుక్కుతినానివ్వదన్నట్టు తయారైంది ఉద్యోగుల పరిస్థితి. అయినా ఎక్స్ ప్రెస్ న్యూస్, టీవీ8 హెచ్ ఆర్ లు ఎవరయా బాబు.. ఉద్యోగం కోసం వచ్చినోళ్ల లిస్టును వాళ్లు పనిచేస్తున్న చానల్ వాళ్లకు చెప్పడమేంటి? చిల్లరవ్యవహారం మంచిదికాదు.

This entry was posted in CRIME NEWS.

Comments are closed.