సాధ్యమైనంత త్వరలో తెలంగాణ బిల్లు: షిండే

ముంబై: తెలంగాణ బిల్లు త్వరలో వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు.  సాధ్యమైనంత త్వరలో తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవిభజన ప్రక్రియపై జీవోఎం కసరత్తు చాలా వరకు పూర్తయిందని తెలిపారు. ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి బిల్లు వస్తుందని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.