‘సాధించేవరకు ఉద్యమమే’-జేఏసీ

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ పూర్తిగా సాకారమయ్యేవరకు కాంగ్రెస్ పార్టీని విశ్వసించవద్దని, కాంగ్రెస్‌ను ప్రజాక్షేవూతంలో నిలదీస్తూనే ఉండాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. వీలైనంత త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంవూతుల అప్పాయింట్‌మెంట్ సంపాదించాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌కు విజ్ఞప్తులు పంపిస్తుండాలని అభివూపాయపడ్డారు. ఢిల్లీలో రౌండ్ సమావేశంతో జాతీయ స్థాయిలో తెలంగాణ అంశాన్ని ఎజెండా చేయడంలో చాలా వరకు సఫలీకృతులమయ్యామని, కొన్ని లోపాలు, మినహాయింపులు ఉన్నప్పటికీ ఢిల్లీ జేఏసీ యాత్ర విజయవంతమయ్యిందని జేఏసీ నాయకులు భావించారు. శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన జేఏసీ నాయకులు అత్యవసరంగా జేఏసీ కార్యాయలంలో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో సాధించిన ప్రగతిని సమీక్షించారు.

ఢిల్లీ రౌండ్ సమావేశంలో జాతీయ నాయకులు పాల్గొనే విధంగా రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు చొరవ చూపినందుకు జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి లేఖ రాస్తామని, ఆమె ఆహ్వానిస్తే చర్చలు జరుపుతామని స్పష్టంగా మీడియాలో ప్రకటించినప్పటికీ, లేఖ విషయాన్ని మీడియా అనవసరంగా రాద్ధాంతం చేసిందని విమర్శలు వచ్చాయి. ఢిల్లీలో వివిధ సందర్భాలలో వ్యవహరించిన తీరులో, నాయకులను కలిసిన తీరులో సమన్వయం లోపించిందని అంతర్గతంగా సమీక్షించుకున్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ చర్చిస్తున్న సందర్భంలోనే రౌండ్ మీటింగ్ జరుపడం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి చాలా అనుకూలంగా పరిణమించిందని అభివూపాయపడ్డారు. అయితే పార్టీల జాతీయ నాయకులను సమావేశానికి తీసుకరాలేకపోవడం లోపమని జేఏసీ నాయకులు చర్చించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.