సాకులొద్దు..మాయ మాటలొద్దు

TDPHOK– అనుకూలమనే చెప్పండి
– అఖిలపక్షంలో తెలంగాణపై ఒకే స్వరాన్ని వినిపించండి
– ములాఖత్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలను కోరిన టీ విద్యుత్ ఉద్యోగులు
తెలంగాణ విషయంలో మాయమాటలతో పార్టీలు తప్పించుకోవద్దని, తమ వైఖరిని స్పష్టం చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు కోరారు. ఏవో సాకులు చెప్పకుండా, ఈ నెల 28న జరిగే అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలమని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు ఏకాభివూపాయాన్ని ప్రకటించేలా ములాఖత్‌లు నిర్వహించాలన్న టీ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపుమేరకు బుధవారం రఘు నేతృత్వంలో వందల సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలను కలిశారు.

విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు కంచె వేశారు. భారీ ఎత్తున దిగిన పోలీసు బలగాలు భవన్ చుట్టూ కాపలాగా నిలబడ్డాయి. ఎన్టీఆర్ భవన్ ముందు ఆందోళన చేసిన టీ విద్యుత్ ఉద్యోగులు అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అఖిలపక్ష సమావేశంలో ఒకే అభివూపాయాన్ని చెప్పాలని ఆయనకు సూచించారు.

దీనిపై అరవింద్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ తెలంగాణపై తమ పార్టీ గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించిందని, ఈసారి అఖిలపక్షంలోనూ ఒకే విధానాన్ని ప్రకటిస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం రఘు అధ్వర్యంలోని తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నేరుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంవూదరావును కలిసి అధికారం పక్షం సాకుచూపి తప్పించుకోవద్దంటూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ తెలంగాణను అడ్డుకోబోమని, తమ పార్టీ తరపున కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కొత్త పార్టీలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీల పేరుతో తెలంగాణ అంశాన్ని దాటవేస్తుండటం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ తప్పించుకునే బదులు, అధికార పక్షంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత టీడీపీ, వైఎస్పార్సీపీలపై ఉందని రఘు అన్నారు. కరెంట్ చార్జీలు, ఇతర అంశాలపై ఒత్తిడి పెంచే పార్టీలు తెలంగాణ విషయంలో ఎందుకు ఒత్తిడి పెంచడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.