సస్పెన్షన్లతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరు: యెండెల

తెలంగాణ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని బీజేపీ పక్షనేత యెండెల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, కిషన్‌డ్డి, శ్రీనివాస్‌డ్డితో కలిసి ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో తెలంగాణ ప్రజలను భయవూబాంతులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ను ఖతం చేయాల్సిందే: నాగం
తెలంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ అంశాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్‌ను ఖతం చేయాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఝాటా, సోనియాగాంధీ ఝాటీ హై అన్నారు. 1100 మందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకుంటే కనీసం సభలో చర్చించకపోవడం దారుణమని, కాంగ్రెస్, టీడీపీని తెలంగాణ ప్రజలు బొందపెడుతారని హెచ్చరించారు. తెలంగాణ ద్రోహుపూవరో టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పాలని నాగం సోమవారం అసెంబ్లీ ఆవరణలో అన్నారు. చలో అసెంబ్లీకి రానివారు ఎవరో అందరికి తెలుసునని అన్నారు.

సీఎంకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు: గుండా మల్లేష్
ప్రజాస్వామ్యంపై సీఎం కిరణ్‌కు నమ్మకం లేదని, పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని సీపీఐ పక్షనేత గుండా మల్లేష్ విమర్శించారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, చంద్రావతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయానికి కిరికిరి చేసే సీఎం.. తెలంగాణ తీర్మానం కేంద్రానికి పంపించలేక పోస్ట్‌మెన్‌గా కూడా పనికిరావడం లేదని అన్నారు.

తెలంగాణపై తీర్మానం చేయాలి: జూలకంటి
తెలంగాణ సమస్య వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడిందని, దీనిపై ఏదో ఒక తీర్మానం చేయాలని సీపీఎం పక్షనేత జూలకంటి రంగాడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి తీర్మానం పంపించాలన్నారు. గ్రామసేవకులు, వీఆర్వోలకు కనీస వేతనాల అమలుచేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.