సర్కార్ దవాఖానాలకు ఏం రోగం పుట్టింది?

ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది
 సీఎం కలలను కల్లలు చేస్తున్నారు. కేసీఆర్ ఆశయాలకు గండి కొడుతున్నారు. ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ పరితపిస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు మాత్రం ప్రభుత్వాస్పత్రిలోని వార్డులను మార్చురీ గదులుగా మార్చుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు.. రోగుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు..   మళ్లీ నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని రోగులతో అనిపించుకుంటున్నరు . వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిరంతరం నిఘా పెట్టినా ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. మొన్న సరోజనీ దేవి కంటి ఆస్పత్రిలో రోగుల కళ్లు పోడగొట్టారు. నిన్న నీలోఫర్‌ ఐదుగురిని పొట్టనబెట్టుకున్నారు.  వైద్యులకెందుకంత నిర్లక్ష్యం.. సిబ్బందికి ఎందుకంత పట్టరానితనం.. ?

This entry was posted in ARTICLES, Top Stories.

One Response to సర్కార్ దవాఖానాలకు ఏం రోగం పుట్టింది?

  1. ఐ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి says:

    గవర్నమెంట్ కొంత మంది డాక్టర్లను పీకేస్తేగాని దవఖానాలు సక్కగ గావు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *