సర్కారు ఇస్తామన్నా మేం అనుమతివ్వం.. ఇవ్వనివ్వం!

anurag– ‘చలో అసెంబీ’్లకి అనుమతి లేదు – ఎవరూ రావద్దు
– చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
– నిర్వాహకులతో ఇబ్బంది లేదు.. పాల్గొనే వారితోనే పరేషాన్
– మావోయిస్టులు వస్తారన్న సమాచారమూ ఉంది
– నగరంలో 300 సీసీ కెమెరాలు .. శివార్లలో 17 చెక్ పాయింట్లు
– అసెంబ్లీకి చుట్టూ 2 కి.మీ. పొడవునా నిషేదాజ్ఞలు
– బందోబస్తులకు రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు
– ‘చలో అసెంబ్లీ’పై మీడియాతో పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ
టీ జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్షికమానికి అనుమతిలేదని, అనుమతి లేని కార్యక్షికమానికి వచ్చి ఇబ్బంది పడవద్దని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్షికమానికి సర్కార్ అనుమతి ఇస్తానన్నా, గత అనుభవాలు, పరిస్థితులను బట్టి పోలీసు శాఖ నుంచి వద్దంటామని చెప్పారు. ‘నిర్వాహకులు శాంతియుతంగా కార్యక్షికమాలు నిర్వహిస్తారు… పాల్గొన్న వారిలోనే కొన్ని దుష్టశక్తులు ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇందుకు గతంలో జరిగిన మిలియన్ మార్చ్, సాగర హారమే నిదర్శనమన్నారు.

బందోబస్తు కోసం నగరంలో ఉన్న 12 వేల సిబ్బందితో పాటు అదనంగా పదివేల మంది పాల్గొంటున్నారని, కేంద్ర బలగాలు కూడా వచ్చాయని చెప్పారు. 119 ప్లాటూన్‌ల ఎపీఎస్పీ బలగాలు కూడా వస్తున్నాయన్నారు. 14న టీ జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపుపై పోలీసు కమిషనర్ బుధవారం తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్షికమానికి అనుమతి లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే జనంపై నిఘా పెట్టేందుకు హైదరాబాద్ చుట్టూ 17 ప్రధాన చెక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్షికమంలో మావోయిస్టులు కూడాపాల్గొంటున్నట్టు సమాచారం ఉందని, శాంతిభవూదతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నగరంలో ఉన్న 300 ట్రాఫిక్ సీసీ కెమెరాలను చలో అసెంబ్లీ నిఘా కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు.

అసెంబ్లీకి చుట్టూ రెండు కిలోమీటర్ల పొడువునా నిషేదాజ్ఞలు విధించినట్టు తెలిపారు.14వ తేదీన పరిస్థితి అదుపుతప్పితే సాధారణ జనాన్ని కూడా అసెంబ్లీ వైపు అనుమతించమన్నారు. బుధవారం ఉదయం ఓయూలో జరిగిన ఘటనపై మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరడంతో బందోబస్తు కోసం ఉన్న పోలీసులు ఎన్‌సీసీ గేట్ వద్ద అడ్డుకున్నారని, విద్యార్థులు రాళ్లు విసిరడంతో అదుపు చేసే క్రమంలో పోలీసులు రెండుసార్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని తెలిపారు. గురువారం ఓయూ జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్షికమానికి కూడా అనుమతిలేదన్నారు. అక్రమంగా టీ వాదులను అరెస్టులు, బైండోవర్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని అడుగగా, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.

నగరంలో 144 సెక్షన్, మద్యం దుకాణాలు, రెస్టాంట్లు బంద్
రాజధాని నగరంలో 13వతేదీ గురువారం ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు144 సెక్షన్ విధిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు నగరంలో శాంతిభవూదతలకు విఘాతం కల్పించే అవకాశం ఉందని వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 14వ తేదీ, శుక్రవారం జరిగే ప్రార్ణనలకు వర్తించవన్నారు. అలాగే ఈనెల 13వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు హైదరాబాద్‌లోని వైన్‌షాపులు, బార్ అండ్ రెస్టాంట్లు మూసి ఉంచాలని కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్‌లకు వర్తించవన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.