సరిహద్దులో శాంతి

china -ఇకపై నిదానంగా వ్యవహరిద్దాం
– భారత్, చైనా పరస్పర అంగీకారం
– సరిహద్దు సమస్యపై చర్చలు వేగవంతానికి నిర్ణయం
– ప్రధాని మన్మోహన్‌తో చైనా ప్రధాని లీ కెకియాంగ్ మరోసారి భేటీ
-సరిహద్దు, నదీ జలాల సమస్యలు, వాణిజ్యం, రవాణా అంశాలపై విస్తృత చర్చ
-ఎనిమిది ఒప్పందాలపై సంతకం
కొద్ది రోజుల క్రితం సరిహద్దు సమస్యపై ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో.. అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలని భారత్, చైనా నిర్ణయించాయి. సరిహద్దు వద్ద నిదానంగా వ్యవహరించాలని నిశ్చయించాయి. ఆదివారం భారత పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ అదే రోజు ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సోమవారం కూడా మళ్లీ వారు ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో సరిహద్దు సమస్య, నదీజలాలు, వాణిజ్య లోటు, రవాణా, ఆహారం తదితర ద్వైపాక్షిక అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఆదివారం, సోమవారం తమ మధ్య జరిగిన చర్చలు ఫలవూపదంగా ముగిశాయని, చర్చలు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, దౌత్య నిబంధనలకు అనుగుణంగా జరిగాయని వారు పేర్కొన్నారు. తొలుత ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ.. ‘చైనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కెకియాంగ్ తన తొలి పర్యటనకు భారత్‌ను ఎంపికచేసుకున్నందుకు కృతజ్ఞతలు. 25 రోజులుగా రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నా.. రెండు దేశాలు పరస్పరం శాంతి, నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇటీవలి సమస్య నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. అదే సమయంలో ప్రస్తుతమున్న వ్యవస్థ సమర్థవంతమైందని నిర్ధారణ అయ్యింది.

సరిహద్దు సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. సత్వరమే, పారదర్శక, సముచిత, పరస్పర అంగీకారయోగ్యంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని ఈ భేటీలో అంగీకరించామని మన్మోహన్ చెప్పారు. సరిహద్దు సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా, సరిహద్దులో శాంతి కొనసాగే బాధ్యతను ఇరు దేశాల ప్రత్యేక బృందాలకు అప్పగించామని, త్వరలోనే ఈ ప్రత్యేక బృందాలకు సమావేశమై చర్చలు కొనసాగిస్తాయని వెల్లడించారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడమే తన పర్యటన లక్ష్యమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పలేనని, కానీ, భారత్-చైనా వ్యూహాత్మక భాగస్వామిగా, మంచి స్నేహితులుగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సరిహద్దు సమస్య చరిత్ర మిగిల్చిన సమస్య అని ఆయన పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాల కంటే.. పరస్పర ప్రయోజన అంశాలపైనే తమ భేటీలో ఎక్కువగా చర్చించామని అన్నారు. ఒకరినొకరు అస్థిరపర్చుకునేలా ఇరు దేశాల చర్యలు ఉండబోవని అన్నారు. ప్రపంచ శాంతిలో భారత, చైనా మధ్య సంబంధాలు కీలకమని వ్యాఖ్యానించిన కెకియాంగ్.. ‘భారత్, చైనా మధ్య వ్యూహాత్మక విశ్వాసం లేకుంటే ప్రపంచ శాంతి భ్రమే అవుతుంది’ అని పేర్కొన్నారు. భారత్, చైనాలు అభివృద్ధి సాధించకుంటే.. ప్రపంచమూ, ఆసియా ఖండం పురోభివృద్ధిలో పయనించలేవని పేర్కొన్నారు. భారత్‌తో సహకారం పెంపొందించుకోవాలని చైనా గట్టిగా కోరుకుంటోందని, తాను ప్రధాని అయిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనను భారత్‌లో చేస్తున్నానని, దీనిని బట్టి భారత్‌తో సంబంధాలకు చైనా ఎంతలా ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు.

‘పరస్పర విశ్వాసం పెంపొందించడం, పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, భవిష్యత్ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం’ అనే మూడు లక్ష్యాలతో తాను భారత్ పర్యటనకు వచ్చానని అన్నారు. భారత్, చైనాలు ఆరోగ్యకరవాతావరణంలో అభివృద్ధి దిశగా పయణించాలంటే.. రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనను మరింత విస్తృతం చేసుకోవాలని, నూతన సంబంధాలను నిర్మించుకోవాలని ఆయన పేర్కొన్నారు. వివిధ సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకు మరింత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇరు దేశాలు ఒక అభివూపాయానికి వచ్చాయన్నారు. ‘భారత్ అంటే నాకు మంచి అభివూపాయం ఉంది. 27 ఏళ్ల క్రితం చైనా యువబృందం ప్రతినిధిగా నేను భారత్‌లో వారం రోజులు ఉన్నాను. ఇప్పుడు ప్రధానిగా భారత్‌కు వచ్చాను. ఇది రెండు దేశాల మధ్య స్నేహానికి నిదర్శనం. ఈ రోజు (సోమవారం) మళ్లీ స్నేహపు మొక్కలను విత్తాం. వసంతంలో అవి విరబూస్తాయి. ఈ ఏడాది చివరలో ప్రధాని మన్మోహన్ మా దేశంలో పర్యటన జరిపే వరకూ వేచి ఉంటాం. అప్పుడు సహకార ఫలాలను ఇరు దేశాలు అందుకుంటాయి’ అని కెకియాంగ్ పేర్కొన్నా

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.