సరబ్‌కు కన్నీటి వీడ్కోలు

SARABవేల సంఖ్యలో తరలివచ్చిన జనం
అంత్యక్రియలకు పంజాబ్ సీఎం, రాహుల్ హాజరు

– వేల సంఖ్యలో తరలి వచ్చిన జనం
– అంత్యక్షికియలకు పంజాబ్ సీఎం, రాహుల్
– సరబ్ జాతీయ అమరవీరుడు
– పంజాబ్ అసెంబ్లీ ప్రకటన
– కుటుంబానికి కోటి ఆర్థిక సాయం
పాకిస్థాన్ జైల్లో దాడికి గురై ఆస్పవూతిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయిన భారతీయ ఖైదీ సరబ్‌జిత్‌సింగ్ (49)అంత్యక్షికియలు శుక్రవారం పంజాబ్‌లోని ఆయన స్వగ్రామం బిఖివింద్‌లో అధికార లాంఛనాలతో తీవ్ర భావోద్వేగాల నడుమ జరిగాయి. అంత్యక్షికియలకు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్‌సింగ్ బాదల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అనేక మంది రాజకీయ నాయకులతో పాటు అశేష సంఖ్యలో జనం పాల్గొన్నారు. సరబ్‌జిత్ సోదరి దల్బీర్‌కౌర్ ఆయన చితికి నిప్పంటించారు. సరబ్‌జిత్ భార్య సుఖ్‌వూపీత్‌కౌర్, కుమ్తాలు స్వప్నదీప్, పూనం, సరబ్‌జిత్ అల్లుడు సంజయ్, బంధువులు, పెద్ద సంఖ్యలో ప్రజల సమక్షంలో అంత్యక్షికియలు జరిగాయి. దల్బీర్‌కౌర్‌కు స్థానిక అకాలీదళ్ ఎమ్మెల్యే విర్సా సింగ్‌వల్తోహా సహకరించారు. అంతిమ సంస్కారానికి ముందు అక్కడ ప్రార్థనలు జరిగాయి.

సరబ్‌జిత్ అంతిమయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మొదలైంది. త్రివర్ణ పతాకం కప్పిన ఆయన శవపేటికను పూలతో అలంకరించిన వాహనంపై ఉంచి శ్మశానవాటికు భారీ ర్యాలీగా తీసుకు అంతకుముందు ఆయనకు ప్రజలు కడపటి నివాళి అర్పించేందుకు వీలుగా ఒక ప్రభుత్వ పాఠశాల మైదానంలో మృతదేహాన్ని ఉంచారు. నివాళులర్పించినవారిలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్‌కౌర్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్‌సింగ్ బాదల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతాప్‌సింగ్ బజ్వా, జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ వెర్కా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కమల్‌శర్మతోపాటు అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తదితరులు ఉన్నారు. సరబ్‌జిత్‌ను ఆఖరిసారి చూసేందుకు జనం సమీప భవంతులపైకి ఎక్కారు. అంత్యక్షికియల కోసం సరబ్‌జిత్ భౌతికకాయాన్ని తీసుకు ఆయన కుటుంబీకులను స్థానికులు ఓదార్చారు. సరబ్‌జిత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన కుమ్తాలు అంతిమయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్రామస్తులు సపర్యలు చేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్.. సరబ్‌జిత్ అమర్ రహే అంటూ పాఠశాల మైదానంలో నినాదాలు మిన్నంటాయి. అక్కడి నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రదర్శనగా గ్రామ శ్మశానవాటికకు తీసుకు స్కూలు నుంచి 400 మీటర్ల దూరం ఉన్న శ్మశానవాటికకు చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది. అంత్యక్షికియలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు హాజరవుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తరన్‌తరన్ నుంచే కాకుండా అమృత్‌సర్ సహా సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులను రప్పించారు.

సరబ్‌జిత్ చనిపోయారని బుధవారం తెల్లవారుజామున తెలియడంతో బిఖివింద్ గ్రామం శోకసంవూదంలో మునిగిపోయింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సరబ్‌జిత్ నివాసానికి తరలివచ్చారు. గురువారం గ్రామంలో దుకాణాలు తెరువలేదు. శుక్రవారం కూడా దాదాపు బంద్‌వాతావరణం కనిపించింది. గ్రామంలో పలు చోట్ల స్థానికులు పాకిస్థాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. సరబ్‌జిత్ విడుదల కోసం విఫలయత్నాలు చేసిన దల్బీర్‌కౌర్.. పాక్ జైళ్లలో మగ్గుతున్న అనేక మంది ‘సరబ్‌జిత్‌ల’ విడుదల కోసం తాను ఇకపై పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. సరబ్‌జిత్ హత్యకు భారత ప్రభుత్వం పాక్‌కు తగిన సమాధానం చెప్పాలని, ఆ దేశంతో సంబంధాలన్నీ తెంచుకోవాలని డిమాండ్ చేశారు. పాక్‌తో చర్చల ప్రక్రియ నిలిపివేయాలని అన్నారు. భారత ప్రభుత్వం కూడా సరబ్‌జిత్ విడుదల విషయంలో బాగా జాప్యం చేసిందని విమర్శించారు. పాకిస్థాన్ ఇంత దారుణానికి తెగబడుతుందని తాను ఊహించలేదన్నారు. సరబ్‌జిత్ కుటుంబానికి పంజాబ్ ప్రభుత్వం కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది.ఆయన కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది.

హత్య వెనుక కుట్ర లేదు : పాక్
సరబ్‌జిత్ హత్య వెనుక ఎలాంటి కుట్ర లేదని పాక్ చెబుతోంది. జైలు అధికారులు ఇలాంటి ఘటనను ఊహించలేదని పాకిస్థాన్ పంజాబ్ ఆపద్ధర్మ ప్రధాని నజామ్ సేథి అన్నారు. అసలు ఇలాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్న సమాచారం కూడా లేదని చెప్పారు.

సరబ్ జాతీయ అమరవీరుడు
సరబ్‌జిత్‌సింగ్‌ను జాతీయ అమరవీరుడిగా ప్రకటిస్తూ పంజా బ్ అసెంబ్లీ ఏకక్షిగీంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సరబ్ హత్యపై అంతర్జాతీయ సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. దాడికి కారణాలు కనుగొనేలా పాక్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు. కాగా, పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలందరికీ తగిన భద్రత కల్పించాలని భారత్-పాక్ జుడిషియల్ ప్యానల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

మృతదేహంలో అవయవాలేవీ లేవు
– తలకు తగిలిన గాయమే సరబ్ ప్రాణం తీసింది..ండో పోస్టుమార్టంలో వెల్లడి
అమృత్‌సర్: సరబ్‌జిత్ మృతదేహంలో కీలక అవయవాలైన పొట్ట, గుండె, కిడ్నీలు, మూత్రాశయం కనిపించలేదని ఆయన మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన అమృతసర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు చెప్పారు. మిగిలిన భాగాలను రసాయనిక పరీక్షల నిమిత్తం పంపించామని తెలిపారు. తలకు తగిలిన బలమైన గాయం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని చెప్పారు. ‘సరబ్ తలకు బలమైన గాయం ఉంది. దాదాపు ఐదు సెంటీమీటర్ల వెడల్పుతో గాయం ఏర్పడింది. శరీరంలో పలు చోట్ల గాయాలు ఉన్నాయి.

ఆయన పక్కటెముకలు విరిగిపోయాయి. కపాలం ఎముకలు చిట్లిపోయాయి. తలకు వెనుక భాగంలో, పైన గాయాలు ఉన్నాయి. పెదవులు, చెవి, రెండు భుజాల వెనుక కూడా గాయాలు ఉన్నాయి’ అని వైద్యులు తెలిపారు. అయితే మరణానికి నిర్దిష్ట కారణాన్ని చెప్పడానికి కొద్దిరోజులు పడుతుందని అన్నారు. సరబ్‌జిత్ ఆరోగ్యకరమైన వ్యక్తి అని, ఆయనను చంపాలనే ఉద్దేశంతో, బలమైన మారణాయుధాలతో దాడి జరిపినట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఈ ఘటనకు పాల్పడి ఉండటం అసాధ్యమన్నారు. సరబ్ కిడ్నీలు, కాలేయం, పొత్తికడుపు, మెదడులోని కొన్ని భాగాలను ఫొరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు లాహోర్‌లో తొలుత పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు చెప్పారు. అయితే, ఈ నివేదికను భారత్‌తో పాక్ అధికారులు పంచుకున్నారా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అదే సమయంలో సరబ్‌కు పెట్టిన వెంటిలేటర్‌ను కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే తొలగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు.. సరబ్‌కు గుండెపోటు వచ్చి చనిపోయిన తర్వాతే వెంటిలేటర్ తొలగించామన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.