సమ్మెలోకి రావాలని సీమాంధ్ర ఉద్యోగినిపై ఒత్తిడి

దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రలో కనీవిని ఎరుగని అకృత్యాలు నెలరోజుల సమైక్యాంధ్ర ఆందోళనల్లో వెల్లు ఉద్యోగుల అభిప్రాయాలతో సంబంధ లేకుండా వారిని బలవంతంగా సమ్మెలోకి లాగుతున్న ఉద్యోగ సంఘాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సచివాలయం న్యాయశాఖ విభాగంలో డ్రాఫ్ట్ మెన్‌గా పనిచేస్తున్న గెజిటెడ్ shaRADHAMBA-3ఉద్యోగిణి శారదాంబను బలవంతంగా సమ్మెలోకి రావాలని సీమాంధ్ర సచివాలయ ఫోరం ఒత్తిడి తెచ్చిన వైనం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నది. సమైక్యాంధ్ర ఉద్యమానికి శారదాంబ మొదటినుంచి దూరంగానే ఉంటున్నారు. సమైక్యాంధ్ర సమ్మె సరైనదికాదని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయమైనదని ఆమె వాదిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఆమె సచివాలయం డీ బ్లాక్‌లోని తన కార్యాలయంలో పనిచేసుకుంటున్నారు. సమ్మెలో పాల్గొనే విషయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. కారణం లేని అంశాలపై సమ్మె చేయడం తగదని.. తాను సమ్మెలో పాల్గొనబోనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్నప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ఇవ్వకపోతే మీడియాలో వార్తలు వస్తాయని ఆమెపై ఒత్తిడి తెచ్చారు.
సమైక్యాంధ్ర ఫోరం నాయకుల తీరుతో మానసిక వేదనకు గురై.. బీపీతో కూలబడిపోయారు. సమాచారం అందుకున్న సచివాలయం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌గుప్తా మరికొందరు తెలంగాణ మహిళా ఉద్యోగులు ఆమెను సచివాలయం ఆస్పవూతికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సచివాలయం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌గుప్తా, సెక్ర తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ ఎం నరేందర్‌రావు తీవ్రంగా స్పందించారు. శారదాంబను సమ్మెలోకి రావాలని ఒత్తిడి చేయడం ద్వారా సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నాయకులు వ్యక్తి స్వేచ్ఛను హరించి వేశారని విమర్శించారు. సమ్మెలోకి రావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంటుందని, ఆమె నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనయేనని విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో న్యాయ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులలో రోజురోజుకూ అసహనం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. మానవత్వం కోల్పోతున్నారని, స్త్రీ ఉద్యోగి అనే గౌరవం కూడా లేకుండా పొట్లాటకు దిగారని, ఈ పద్ధతులు మంచివి కావని హితవు చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.