సమైక్య సభతో ఎల్బీ స్టేడియం మలినం

– శుద్ధి కార్యక్రమం నిర్వహించిన టీ అడ్వకేట్లు, మహంకాళీ ఆలయ కమిటీ
సమైక్య సభ ఔరంగజేబు దండయావూతను తలపించిందని మండిపాటు

ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన సభతో ఫతేమైదాన్ (ఎల్బీ స్టేడియం) అపవిత్రమైందని తెలంగాణ న్యాయవాదులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా, సమైక్యాంధ్ర నేతలు అవాస్తవాలు మాట్లాడినందుకు మైదానాన్ని ఆవు పంచకం, పాలతో శుద్ధి చేశారు. ఆదివారం తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురోహితులు వేదమంవూతోచ్చారణల మధ్య మైదానాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేశారు.

lbstadm ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ శ్రీరంగారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంపై అసత్యాలు పలుకుతూ తెలంగాణ గడ్డను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో సభకు షరతులతో కూడిన అనుమతులు ఉన్నప్పటికీ.. అన్ని షరతులు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఉద్యోగులను మాత్రమే సభకు అనుమతించాలని కోర్టు విధించిన షరతుకు భిన్నంగా.. సీమాంధ్రుకు చెందిన వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇతరులు వచ్చారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నాయకులు పీ గోవర్ధన్‌డ్డి, జీ గోవర్ధన్‌డ్డి, ఉపేందర్, శ్రీధర్‌డ్డి, అరుణాడ్డి, మంజుల, విజారత్, కొమురయ్య, వై రాములు, జగ్‌పాల్‌డ్డి, భిక్షపతి, మాణిక్ ప్రభు పాల్గొన్నారు.

సీమాంధ్రులది దండయాత్రే..: ‘గోల్కొండపైకి దండయాత్ర కోసం వచ్చిన ఔరంగజేబుకూడా ఫతే మైదాన్‌లోనే తిష్ఠవేశాడు. ఇప్పుడు సీమాంధ్ర గూండాలు ఫతే మైదాన్‌లో సభ నిర్వహించి తెలంగాణ ప్రజలపైకి దండయాత్రకు తెగించారు’ అని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళీ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన సమైక్య సభతో ఫతే మైదాన్(ఎల్బీ స్టేడియం)ను మలినమైందని.. వారు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.

శనివారం ఉదయం పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళీ ఆలయంనుంచి పాలు ఇతర శుద్ధి సామగ్రిని తీసుకెళ్తూ ఆలయ కమిటీ అధ్యక్షుడు కే విష్ణుగౌడ్, ఉపాధ్యక్షుడు ఏ మాణిక్‌వూపభుగౌడ్, కోశాధికారి టీ తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఫతే మైదాన్‌లో సభకు సీమాంధ్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడమం తెలంగాణపై సీమాంధ్ర దురాక్రమణకు నిదర్శనమన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు, ఉద్యోగుల ముసుగులో సీమాంధ్ర గుండాలు పోలీసుల అండతో సభ నిర్వహించడంతో ఫతేమైదాన్ మలినమైందన్నారు. ఇంత వైషమ్యం వెళ్లగక్కాక పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.