సమైక్య ఆందోళనల వెనుక సీమాంధ్ర చానళ్ల యాజమాన్యాలు

జరగనివి జరిగినట్టు చూపిస్తూ సీమాంధ్ర సామాన్య ప్రజలను వీధుల్లోకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది సీమాంధ్ర మీడియా.  ఈ టీవీ-2 రామోజీ,  ఎన్టీవీ చౌదరి, కొమ్మినేని, నేమాని, టీవీ5 నాయుడు, బ్రహ్మానందరెడ్డి, టీవీ9 రవిప్రకాష్, రజినీకాంత్, మురళీక్రిష్ణ, అవుట్ పుట్ ఎడిటర్స్,  ఏబీఎన్ ఆర్కే, మూర్తి, సీవీఆర్ వెంకటేశ్వర్రావు, కందుల, పాయింట్ బ్లాంక్, మహాటీవీ ఐవీఆర్, జీ 24 గంటలు శివప్రసాద్, ఐన్యూస్ ధాత్రి మధు, సాక్షి భారతి, 10 టీవీ రాఘవులు, తమ్మినేని, అరుణ్ సాగర్, స్టూడియో ఎన్ అందరూ.. జెమిని కసాయి.. అంతా కలిసి కట్టుకథలతో సీమాంధ్రలో అలజడి రేపుతున్నరు. నిష్కల్మషంగా ఉన్నవారి మదిలో తెలంగాణ వ్యతిరేకత నూరిపోస్తున్నరు.  వార్తేంటో వాస్తవమేంటో తెలుసుకోకుండా  రెచ్చిపోతున్నరు. ఇటు సీమాంధ్ర ఉద్యోగులకు, అటు రాజకీయనేతలకు సలహాలిస్తూ  సీమాంధ్రలో విధ్వంసాలకు కారణమయిన్రు. ఇందులో 13 జిల్లాల్లోని అన్ని చానళ్ల రిపోర్టర్లు ముఖ్య పాత్ర పోషించిన్రు. పోషిస్తున్నరు.  సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించాలని యాజమాన్యాలు చెప్పడంతో మరీ రెచ్చిపోతున్నరు.  జనంలేని చోట ఏపీయూడబ్ల్యూజే బ్యానర్ పెట్టి పక్క చానల్ రిపోర్టర్లను మాట్లాడిస్తున్నరు. ఒక్కొక్కరుగా లైవ్ ఇస్తూ పక్క చానళ్ల రిపోర్టర్లను లైవ్ లోకి తీసుకుంటున్నరు.  ప్రజలను సమైక్యాంధ్ర ఉద్యమానికి ఉసిగొల్పుతూ వాళ్లు మాత్రం పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నరట.

అటు గుంటూరులో విభజనకు అనుకూలంగా ర్యాలీ తీసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను అరెస్ట్ చేసిన వార్తను జర్నలిస్టులు కవర్ చేసిన పాపానలేదు. ప్రత్యేకాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న తమగొంతు నొక్కుతున్నరని సామాజికాంధ్ర జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బాగాతాగి తన్నుకుని చనిపోతే సమైక్యాంధ్ర కోసం చనిపోయిన్రని మీడియా వార్తను ప్రసారం చేయడంపై పల్నాటి శ్రీరాములు మండిపడ్డరు.

సీమాంధ్రలో జర్నలిస్టులంతా మందబుద్ధితో వ్యవహరిస్తున్నరు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేతలు తెలివిలేక పొట్టి శ్రీరాములు ఆశయం కోసం పోరాడుతున్నమని చెప్తే.. జర్నలిస్టులు కూడా అదే చెప్తున్నరు. పొట్టిశ్రీరాములు చనిపోయింది ప్రత్యేకరాష్ట్రం కోసం వీళ్లు చెప్తున్నది సమైక్య రాష్ట్రం అని.. ఒక్కజర్నలిస్టు కూడా మెదడులేకుండా లైవ్ లు ఇస్తున్నరు. తెలితక్కువముఖాలు.. కనీసం పొట్టి శ్రీరాములు పేరును స్కిప్ చేసి లైవ్ ఇవ్వండి.. జర్నలిజం పరువు తీయకండి.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.