సమైక్యాంధ్ర జేఏసీకి సీఎం చైర్మన్, డీజీపీ కన్వీనర్-హరీష్ రావు

సమైక్యాంధ్ర జేఏసీకి సీఎం కిరణ్ చైర్మన్ గా.. డీజీపీ దినేష్ రెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నడని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు.  తెలంగాణ గడ్డ మీద సీమాంధ్ర అరాచకవాదులకు అండగా ఉంటూ తెలంగాణ బిడ్డలపై పోలీసులు జులుం చేస్తున్నరని హరీష్ మండిపడ్డరు.  నగరంలో రక్షణ కావాల్సింది తెలంగాణ వారికా? సీమాంధ్రులకా? అని  ప్రశ్నించిన్రు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. నెల్లూరులో తెలంగాణకు చెందిన ఓ జిల్లా అధికారిపై సీమాంధ్రులు దాడి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ నర్సులు శిక్షణ కోసం వెళితే వెనక్కి పంపించారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు గన్‌మెన్లను పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు సీమాంధ్రలో ఉన్నాయి. మరలాంటప్పుడు రక్షణ కావాల్సింది సీమాంధ్రులకా? తెలంగాణ వారికా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్క సీమాంధ్ర ఉద్యోగిపైన దాడి జరిగిందా అని అడిగారు. తెలంగాణ నడిగడ్డపై విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగిపై దాడి జరిగితే పరామర్శించడానికి వచ్చిన తమను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించిన్రు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

One Response to సమైక్యాంధ్ర జేఏసీకి సీఎం చైర్మన్, డీజీపీ కన్వీనర్-హరీష్ రావు

  1. Gugulothu venkati says:

    60 years simaandhra people are like british rulaer they take all source of Telangana still they try to countinue to take source from Telangana this is very bad Behaviour of Simandhra people