సమైక్యవాదుల సభలో స్టేజిపై నుంచి లగడపాటిని గుంజి కిందపడేసిన తెలంగాణవాది

భారీ బందోబస్తు మధ్య వేదిక మీద నుంచి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రసగిస్తుంటే తెలంగాణ యువసేన(టీవైఎస్)కు చెందిన కార్యకర్త బండి కిరణ్‌ప్రకాశ్, మరికొందరు జెండాలతో జనం మధ్య నుంచి వేదిక వద్దకు దూసుకొచ్చారు. తెలంగాణ నినాదాలు చేస్తూ లగడపాటిని రాజగోపల్‌ను అమాంతంగా కిందికి గుంజి పడేసిన్రు. ఆయన కిందపడిపోవడంతో ధర్నాలో గందరగోళం నెలకొంది. జై తెలంగాణ నినాదాలు చేస్తూ టీవైఎస్ జెండాను ప్రకాశ్ రెపరెపలాడించిన్రు. ఉన్మాద సమైక్యవాదులు తెలంగాణవాదులపై దాడి చేశారు. అప్పటికే అక్కడున్న పోలీసులు ప్రకాశ్‌తోపాటు వేదిక వద్ద తెలంగాణ నినాదాలు చేసిన టీవైఎస్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, తోలుగంటి రాజును అరెస్టుచేశారు.

పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్తూ పిడిగుద్దులు కురిపించారు. మీడి యా ప్రతినిధులు కవర్‌చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన జర్నలిస్టుపై ఓ కానిస్టేబుల్ దాడి చేయడంతో పాత్రికేయులు నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణవాదాన్ని అవమానపరిచేలా లగడపాటి ప్రసంగించినందుకే నిరసన తెలిపామని నాగేశ్వర్, రాజు పేర్కొన్నారు. బండి కిరణ్‌ప్రకాశ్ నిజాం కాలేజీ విద్యార్థి. సిద్ధిపేటకు చెందిన రాజు వైపీఆర్ కళాశాలలో బీఎస్సీ చదువుతుండగా, నాగేశ్వర్ ఎంబీఏ పూర్తిచేశారు.

saveap1బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణవాది ఆకుల శ్రీనివాస్ వేదిక వద్దకు వచ్చి తెలంగాణ నినాదాలు చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి తెలంగాణ ఆజాద్ ఫోర్స్‌కు చెందిన కార్యకర్తలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ధర్నా చివరలో సీమాంధ్ర నేతలు వెళ్లిపోతుండగా కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్ వేదిక వద్దకు వచ్చి జైతెలంగాణ అనినినదించారు. 1992 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ రెండు రోజులుగా సెలవుపెట్టి హైదరాబాద్ కు చేరుకున్నాడు. ధర్నాలో తెలంగాణ నినాదాలు చేసిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.