సుప్రీంకోర్టులో సీమాంధ్ర నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. మొత్తం 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. విభజనపై జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డే సుమారు గంటన్నర పాటు సుదీర్ఘ వాదనలు విన్నారు. సుప్రీంకోర్టు విచారణకు ఇది సరైన సమయం కాదని ధర్మాసనం తెలిపింది.
అపరిపక్వ దశలో ఉన్న పిటిషన్లను పట్టించుకోమని సుప్రీం వ్యాఖ్యానించింది. గతంలోనూ విభజనపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణకు అడ్డుగా సుప్రీంకు వెళతామని అంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టిన సీమాంధ్ర నేతలకు ఈ తీర్పుతో మైండ్ బ్లాక్ అయింది.
సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ మళ్లీ వేసే అవకాశం కూడా లేదని న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మళ్లీ ఎవరు సుప్రీంలో పిటిషన్లు వేసేందుకు ప్రయత్నించినా కోర్టు స్వీకరించదని ఆయన పేర్కొన్నారు.