సమైక్యపాలకులు తెలంగాణనుకొల్లగొట్టారు: గుండా

సమైక్య పాలకులు తెలంగాణను కొల్లగొట్టారని సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణ అణచివేతకు గురైందని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ శాసనసభా సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సీఎం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ తెలంగాణకు ఏదో ఒరగబెట్టినట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడొద్దనే ధోరణితో సీఎం వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఆంధ్రా పాలకుల వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని తెలిపారు. నీటి ప్రాజెక్టులను తెలంగాణకు ఇచ్చినట్టు కిరణ్ చెబుతున్నాడని ఆరోపించారు. విద్యుత్‌పై కూడా సీఎం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని పేర్కొన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.