సమైక్యం కృత్రిమమే-బైరెడ్డి రాజశేఖర్‌డ్డి

– ఇది పెట్టుబడిదారుల సృష్టి.. వ్యాపారాల కోసమే రాజకీయం
– తెలంగాణ రావడం ఖాయం.. రాయలసీమను కూడా ప్రకటించాలి
– ఆంధ్రా, తెలంగాణతో కలిసి ఉండే ప్రసక్తే లేదు
– సీమ డిమాండ్ల సాధనకు 21న ఢిల్లీకి: బైరెడ్డి రాజశేఖర్‌డ్డి
సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమమేనని రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరడ్డి అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది పెట్టుబడిదారులతోపాటు సమైక్యరాష్ట్రంలో మంత్రులుగా ఉండాలనుకునేవారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు కోట్లలో పెట్టుబడి పెట్టి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి పెట్టుబడికి రిటర్న్స్ రావాలి కదా.. అందుకే వారు రాష్ట్రాన్ని ముక్కలుకాకుండా.. పెద్దగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం పెద్దగా ఉన్నప్పుడే మరింత సంపాదించుకోవడానికి వీలుంటుందన్న ఉద్దేశంతోనే తెలంగాణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా తెలంగాణ ఏర్పడటం ఖాయమన్నారు.

తెలంగాణ ప్రజలు, నాయకులు, ఉద్యమకారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలు, అన్ని పార్టీల వారు కలిసికట్టుగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటారన్నారు. వారికి ముందుగానే అభినందనలు చెబుతున్నట్లు చెప్పారు. తెలంగాణ స్పూర్తితోనే ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమించాలని సీమవాసులను కోరారు. తెలంగాణను ఏలా ఇస్తున్నారో అలాగే రాయలసీమను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నాయకులకు సిగ్గు లేదని, తెలంగాణ నేతలను చూసి సిగ్గు, బుద్ధి తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. కోస్తాంధ్ర నేతల ఎంగిలి మెతుకుల కోసం సీమ నేతలు కక్కుర్తి పడి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాయలసీమ నేతలు ఉద్యమించి ప్రత్యేక సీమ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. తమ ప్రాంత నాయకులు అనవసరంగా తెలంగాణలో కాళ్లు వాచేలా పాదయావూతలు చేస్తున్నారని విమర్శించారు. ఈ యాత్రల వల్ల ఉపయోగం లేదని అక్కడి ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సమైక్యంగా ఉండి తాము మోసపోయింది చాలునన్నారు. సీమ నాయకులకు శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగిందో.. అందులో ఏముందో కూడా తెలియదని చెప్పారు.

ఆంధ్రాలోగానీ, తెలంగాణలోగానీ కలిసిఉండే సమస్య లేదని స్పష్టం చేశారు. తమకు ప్రత్యేక సీమ రాష్ట్రం కావాల్సిందేనని బైరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు సంబందం లేదన్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇక తాము కలిసి ఉండబోమన్నారు. సమైక్యాంధ్ర వల్ల రాయలసీమకు ఒరిగిందేమి లేదన్నారు. రాయలసీమకు 1953, 1956లలో అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా 2013లో మరోసారి అన్యాయం జరుగబోతోందని చెప్పారు. సీమకు చెందిన నాలుగు జిల్లాలను కలిపి రాష్ట్రంగా ప్రకటించినా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి ఇచ్చినా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. 500 ఏళ్ల క్రితమే రాయలసీమ సుభిక్షంగా ఉన్నట్లు చరిత్ర చెబుతోందన్నారు. తమకు రాష్ట్రం ఇస్తే ప్రకృతి సంపదలతో పాటు తిరుపతి వెంక స్వామి ఆశ్సీసులతో అభివృద్ధి చేసుకుంటామన్నారు. తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కరలేదన్నారు.

రాయలసీమ రాష్ట్రం కావాలా? లేదా? అని ఈ ప్రాంత ప్రజలతో రిఫండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రా్రష్ట్రం కోసం నాయకులంతా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21న ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలకు, అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి తమ వాదనను వినిపిస్తామని చెప్పారు. సీమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు. తమ లక్ష్యం రాయలసీమ రాష్ట్రం ఏర్పా సమైక్యాంవూధతో తమకు ఒరిగేది ఏమి లేదని చెప్పారు. రాయల తెలంగాణ తమకు ఎంత మాత్రం అంగీకారం కాదని మరోసారి బైరెడ్డి స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.