‘సమైక్యం’ ఉద్యయమంకాదు.. అల్లరి-పల్నాటి శ్రీరాములు

– పెట్టుదారుల కృత్రిమ సృష్టి
– రెండు కులాల అధికారం కోసమే ఈ నినాదం
– పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే
ఏపీ ఎన్జీవోల సమ్మె
– వారి సమ్మెకు దూరంగా ఉన్న బహుజన ఉద్యోగులు

‘సీమాంవూధలో కొంతమంది పెట్టుబడిదారులు మాత్రమే కృత్రిమంగా సమైక్యమంటూ అల్లరి చేయిస్తున్నారు తప్ప ఉద్
యమాలు చేయడం లేదు.. సీమాంవూధలో బహుజనులు రాజ్యాధికారం సాధించడానికి ఒక అవకాశం వచ్చింది. దీనిని జారవిడుచుకోవద్దు. కృత్రిమంగా జరుగుతున్న సమైక్యలొల్లిలో దళిత, బహుజన వర్గాలు దూరంగా ఉన్నా యి. పాత ఆంధ్ర రాష్ట్రాన్ని పునరుద్ధరించుకొని రాజధానిని, పరిక్షిశమలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్‌ను నిర్మించుకోవాలి’ అని అంటున్న బహుజన ఆంధ్రా ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ పల్నాటి రాములుతో నమస్తేతెలంగాణ ప్రతినిధి ఇంటర్వ్యూ..

ప్ర: సమైక్య ఉద్యమానికి కారణాలు ఏమిటి?
జ: సీమాంవూధలో జరుగుతున్నది ఉద్యమం కాదు.. అదొక లొల్లి. కొంత మంది పెట్టుబడిదారులు తమ స్వార్థం కోసం చేస్తున్న అల్లరి మాత్రమే. బడుగు, బలహీన వర్గాలు, అగ్రకులాలకు చెందిన పేదలు, రైతులు అంతా దీనికి దూరంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజపూవ్వరూ కూడా ఈ లొల్లి లో భాగస్వాములు కాలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయం ఒక గంట లో వస్తుందనగా శ్రీచైతన్య కళాశాల వాళ్లు తమ కళాశాలలోని పిల్లలను రోడ్లమీదకు తీసుకువచ్చి ఆందోళన చేయించారు. దీనిని బట్టే వాళ్లు కేవలం తమ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఈ లొల్లిలో సీమాంధ్ర మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఎందుకు కోరుకుంటున్నారు?
సీమాంధ్ర దళిత, బహుజన వర్గాలకు చెందిన సమస్త ప్రజానీకం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నారు. రాష్ట్ర విభజన ద్వారా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని నమ్ముతున్నాం. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించినట్లుగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లోని పేదలకు లాభం జరుగుతుంది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ఏమిటి?
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అనడం కన్నా… పాత రాష్ట్రం ఆవిర్భావం అంటే సరిపోతుంది. తద్వారా రాజధాని నగరం ప్రజలకు దగ్గరలో ఉంటుంది. కేంద్ర విశ్వవిద్యాలయం, కేంద్ర పరిక్షిశమలు, పరిశోధనా రంగ సంస్థలు, ఐఐటీలు వస్తాయి.

రాజకీయ నాయకత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది?
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో సామా న్య ప్రజలకు అభివృద్ధి ఫ లాలు దక్కుతాయి. సీమాంవూధలో పార్టీలు మిథ్య.. కులాలు నిజం. పార్టీలకు అతీతంగా కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నాయకులు కలిసి, విడివిడిగా ఉద్యమాలు చేస్తున్నారు. సమైక్యాంధ్ర అంటూ నాటకాలు ఆడుతున్నారు. రెండు కులాలకు చెందిన ప్రతినిధులు వైఎస్సార్సీపీకి చెందిన విజయమ్మ, టీడీపీకి చెందిన ధూళిపాళ్ల నరేంద్ర, దేవినే ని ఉమ, నన్నపనేని రాజకుమారి గుంటూరు, విజయవాడలో దీక్షలు చేయడమే మంచి ఉదాహరణ.

సమైక్యానికి పునాది ఉందా?
అగ్రకుల ధనవంతుల ప్రయోజనాలే ఈ ఉద్యమానికి తాత్వికపునాది. ఈ ఉద్యమానికి ఆర్థికవూపయోజనాలు, హైదరాబాద్‌లో పెట్టిన పెట్టుబడులు కాపాడుకోవడం కోసమే అనే ది పాక్షిక సత్యం మాత్రమే.. చిన్న రాష్ట్రాల ఆవిర్భావం వల్ల రెండుకులాల ఆధిపత్యానికి గండి పడుతుంది. ముఖ్యంగా దళిత,బహుజన శక్తులు అధికారంలోకి వస్తాయనే కలవరం ఈ కులాలకు పట్టుకుంది. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయానికి రాగానే దీనిని అడ్డుకోవడానికి హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారు.. ఇది కేవలం ఒక సమస్యను సృష్టించడానికే.

రాష్ట్ర ఏర్పాటుకు మీరేం చేస్తున్నారు?
సీడబ్యూసీ రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని ప్రకటించగానే గుం టూరు, ఒంగోలుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగ సంఘా లు రాష్ట్ర విభజనను స్వాగతిస్తూ సభలు ఏర్పాటు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి అభినందనలు తెలిపారు. కానీ ఈ సభలను సీమాంధ్ర మీడియా కనీసం స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. ఇదే కాదు.. ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణ కోసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బహుజన వర్గాలు పదమూడేళ్లుగా పోరాడుతున్నాయి. 2011లో గుంటూరులో నిర్వహించిన సామాజిక ఆంధ్రా భేరికి ప్రజాగాయకుడు గద్దర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఏపీ ఎన్జీవోలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని అడిగితే బహుజనవర్గాల ఉద్యోగ సంఘాల నాయకులు.. తాము పాల్గొనమని తేల్చి చెప్పారు.

మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి?
ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణకు దళిత, బహుజన వర్గాలు ఎదు రు చూస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో, కొత్త రాజధానిలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆంధ్రా- తెలంగాణకు చెందిన వివిధ రాంగాల నిపుణులతో సామాజిక ఉద్యమం-ఉభయ ప్రాంతాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం, భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్ సమావేశం నిర్వహించాం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా అన్ని జిల్లాల్లో రౌండ్ సమావేశాలు, ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఇలాంటి కీలకమైన సమయంలో అగ్రకులాల ఆధిపత్యాన్ని బహుజనులంతా ఏకమై అప్రమత్తంతో వ్యవహరించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.