సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేత

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఏపీ పునర్విభజన చట్టం-2014పై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. విభజనపై ఏర్పాటు చేసిన 15 కమిటీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. విభజనపై వివిధ శాఖలకు సీఎస్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. మార్చి 15 లోపు అన్ని శాఖల ఫైళ్ల జాబితాను తయారు చేసి సాధారణ పరిపాలన శాఖకు ఇవ్వాలని పేర్కొన్నారు. మార్చి 30 లోపు నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. తమ స్వస్థలం సమాచారం ఇవ్వని ఉద్యోగుల జీతాలు నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగుల వివరాలు ఇవ్వకుంటే జీతాలు నిలుపుదల చేస్తామని గతంలోనే చెప్పామని అధికారి పీవీ రమేశ్ తెలిపారు.

2014 సంవత్సరంలో 5,400మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు,
2015 సంవత్సరంలో 17,600 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు,
2016 సంవత్సరంలో 16,930 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు,
2017 సంవత్సరంలో 18,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కానున్నారు, విభజన వల్ల 93శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ క్యాడర్ లో 76 వేల మంది ఉద్యోగులుంటే 53 వేల మంది ఉద్యోగుల డాటా దొరిగిందని, మిగత పోస్టులు ఖాళీగా ఉన్నాయని అనుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొం

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.