సమరానికి సన్నద్ధం

kkk

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఇక అంత్యస్థాయిలో ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాన్ని రచిస్తోంది. అనుసరించాల్సిన ఉద్యమ పంథాపై చర్చిస్తూ తుది అడుగులు వేస్తోంది. తెలంగాణ కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఉద్యమాలను ఉధృతంగా నిర్వహించిన టీఆర్‌ఎస్, రానున్న రోజుల్లో పతాక స్థాయికి తీసుకెళ్ళేందుకు సమాయత్తమవుతోంది. తెలంగాణపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి ఆ పార్టీని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఇంత దీర్ఘకాలం ఎన్ని రకాలుగా ఓపిక పట్టినా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష పట్ల సరైన రీతిలో స్పందించకపోవడంపై మండిపడుతోంది. ఇక మెత్తబడి మిన్నకుండేది లేదంటున్న టీఆర్ ఎస్.. తెలంగాణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా ఉన్నా రాజకీయ పార్టీల నాయకులు మాత్రం తలోదిక్కు ఉండటం వల్ల నష్టం జరుగుతోందన్న అంశాన్ని కేసీఆర్ ప్రధానంగా విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ నాయకుల్లోనూ ఐకమత్యం అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించగా, కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు రాజకీయశక్తులను ఏకంచేసి ఆ ప్రక్రియను వెనక్కి నెట్టిన విషయాన్ని టీఆర్‌ఎస్ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల్లో ఐకమత్యం లేనంతకాలం సీమాంవూధుల ఆటలు సాగుతూనే ఉంటాయన్న వాస్తవాలను గుర్తించాలన్నదే టీఆర్‌ఎస్ వాదనగా ఉంది. తెలంగాణ ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఆమరణ దీక్షతో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ నేత జానాడ్డి నివాసానికి వెళ్లి తెలంగాణలోని అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి టీజేఏసీ ఆవిర్భావానికి బీజం వేశారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు టీజేఏసీ నుంచి దూరమయ్యాయి. దీన్ని సాకుగా తీసుకుని దాదాపు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని నాన్చుతూ వస్తోంది. కాగా ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ పలువురితో చర్చలు జరిపారు. నెలపాటు ఢిల్లీలో మకాం వేసిన ఆయనకు తెలంగాణపై సంకేతాలు అందాయి. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల వల్ల తెలంగాణపై నిర్ణయం వాయిదాపడిందని అంటున్నారు.

తెలంగాణ ఇస్తే సంబురాలు, లేకుంటే సమరమే అని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. కేంద్రం నాన్చుడు ధోరణితో ఓపిక నశించి ఇక సమరం చేయాల్సిందేనని ఆయన నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఇటీవల పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌డ్డి నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధపడిన హరీశ్వర్‌డ్డి ఈ నెల 15న అందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కే కేశవరావు నివాసానికి వెళ్లి మాట్లాడారు. తెలంగాణ కోసం అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరికొంతమంది ప్రముఖులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలిసింది. తెలంగాణలోని సంస్థలు, సంఘాలతోనూ ఆయన సంప్రదింపులు జరుపనున్నారు. ఈసారి నిర్వహించే ఉద్యమాలతో కేంద్రం దిగి రావాల్సిందేనన్న కృతనిశ్చయంతో టీఆర్‌ఎస్ వర్గాలు ఉన్నాయి. ఈ నెల 15న రంగాడ్డి జిల్లా చేవెళ్లలో లక్ష పైచిలుకు మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా మరో ఉద్యమ ప్రస్థానానికి నాంది పలికేందుకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది.

కాగా, ఈ నెల 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మేధోమథనాన్ని నిర్వహించి ఉద్యమ స్వరూపాలపై చర్చించనున్నారు. ఉద్యమ పార్టీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎన్నికలు వచ్చేసరికి ఫలితాలు భిన్నంగా ఎందుకు ఉంటున్నాయన్న అంశాన్ని టీఆర్‌ఎస్ ఈ మేధోమథనంలో ప్రధాన ఎజెండాగా తీసుకోనున్నట్లు తెలిసింది. రానున్న సార్వవూతిక ఎన్నికల్లో వంద అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలే టార్గెట్‌గా రంగంలోకి దిగాలన్న లక్ష్యంతో సాగనున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రచించే ఏర్పాట్లను ఇప్పటినుంచే ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో యాత్రలు నిర్వహించే విధంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పల్లెపప్లూకు గులాబీ శ్రేణులు వెళ్లేలా కార్యక్షికమాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.