సమరభేరి’కి ఇంటికొకరు రావాలి: ఈటెల

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి గళమెత్తడానికి పోరుగడ్డ నల్లగొండ సమాయత్తమవుతుంది. ఈనెల 25న సూర్యాపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిచబోయే ‘సమరభేరీ’ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు తరలిరావాలని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ‘సమరభేరికి ఇంటికొకరు, చేతిలో గులాబీ జెండాతో రావాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ నిర్వహించే పల్లెబాట కార్యక్రమంలో కాంగ్రెస్ మోసాన్ని గ్రామాగ్రామాన ఎండగడతామని ఈటెల హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.