సమరం సాగిద్దాం.. విజయం సాధిద్దాం..సీఎంకు టీఆర్‌ఎస్ అంటే ఏందో చూపిద్దాం!

 

KCRR
– టీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ పిలుపు
– సర్వేలన్నీ మనకే అనుకూలం
– ఆంధ్ర పార్టీపూందుకని చర్చ పెట్టండి
– మన పథకాలపై అవగాహన పెంచండి
– ఎన్నికలొచ్చేదాకా వేరే పోరాటాలూ చేయాలి
-రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్షుడి దిశానిర్దేశం
తెలంగాణ ప్రాంతానికి రూపాయి కూడా ఇవ్వనని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకుపోవాలని టీఆర్‌ఎస్ నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. బయ్యారం ఉక్కుపై సంగాడ్డి సభలో సీఎం మాటలను కూడా ప్రజల్లో చర్చకు పెట్టాలని కోరారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్రకమిటీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు.

‘తెలంగాణ ప్రాంతానికి రూపాయి కూడా ఇవ్వనని సీఎం ఎట్ల అంటాడు?.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని సూచించారు. సీఎంకు టీఆర్‌ఎస్ అంటే ఏందో చూపిద్దామని అన్నట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌డ్డి అహంకార ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను ఆయన కోరారు. సీమాంధ్ర ముఖ్యమంవూతులుండటంవల్లే తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతోందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆంధ్ర పార్టీలు అవసరమా?.. అన్న అంశానికి కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఆంధ్ర పార్టీలకు తెలంగాణ నాయకుపూవరైనా అధ్యక్షుడిగాగానీ, వారి పార్టీ తరపున సీఎంగాగానీ అవుతారా? అన్న అంశాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టాలని సూచించారు.

ఆంధ్ర పార్టీలవల్లే వచ్చిన తెలంగాణ పోయిందన్న విషయంపై ప్రజలను చైతన్యపరుచాలని, టీఆర్‌ఎస్ పార్టీనే ఏకైక మార్గంగా ప్రజలు భావించేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించినట్లు సమాచారం. పార్టీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను కూడా ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ వచ్చినంక పేదలకు ఉచితంగా నిర్మించి ఇచ్చే టూ బెవూడూమ్‌ల ఇళ్ల పథకాన్ని, లక్ష రూపాయలలోపు రుణాల రద్దు, ప్రతి మండలానికి లక్ష ఎకరాల సాగు వంటి అంశాలను తెలియజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రమే అంతిమ లక్ష్యమని, రాష్ట్రం ఏర్పడేవరకు ప్రజలకు అవసరమైన తాత్కాలిక అవసరాల కోసం కూడా పార్టీ పోరాటం చేయాలని సూచించారు. అందులో భాగంగానే బయ్యారం ఉక్కుపై పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిందని చెప్పారు. 10న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 14న మండల కేంద్రాల్లో ర్యాలీలను నిర్వహించాలని ఆదేశించారు.

రాజకీయ పంథా ద్వారానే తెలంగాణ సాధ్యమని పార్టీ పెట్టినరోజే చెప్పానని, లేకుంటే ఇప్పటికీ ఉద్యమాలు చేసేవారు దానికే పరిమితం అయ్యేవారని, టీఆర్‌ఎస్ విధానంవల్లే కొన్ని పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తానంటున్నాయని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం ఉందని, అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం 105అసెంబ్లీ, 15ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని నేతలకు వివరించారు. బయ్యారం ఉక్కు గనులపై పార్టీ క్యాడర్ అంతా ఉద్యమానికి సిద్ధం కావాలని కేసీఆర్ గట్టిగా ఆదేశించినట్లు సమాచారం. పార్టీలోని నాయకులు నియోజకవర్గాలపై దృష్టి పెట్టి 10వేల మందితో శిక్షణ తరగతులు నిర్వహిస్తే విజయం వారి వెనుకే ఉంటుందని చెప్పారు. ఒక నియోజకవర్గంలో10వేల మంది కార్యకర్తలతో శిక్షణ తరగతులు పెడితే వారి విజయం ఖాయమని అన్నట్లు తెలిసింది

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.