సమన్యాయం అంటే?

కొడితే కొట్టారు కానీ.. విజయమ్మ ‘సమన్యాయం’ను చంద్రబాబు కాపీకొట్టి తన మేధోశిశువులా బేషుగ్గా వాడేసుకుంటున్నారు. సరే.. వైఎస్సార్సీపీ ఎలాగూ ‘సమైక్యాంవూధ’కు షిఫ్టయింది కాబట్టి.. కాపీరైటు సమస్య లేదు కానీ… ఇటు టీడీపీలోనే తెగని చిక్కొచ్చి పడింది. ఆ పదానికి, చంద్రబాబు వాగ్ధోరణికి టీకా తాత్పర్యాలు అర్థం కాక అటు సీమాంవూధనేతలు, ఇటు తెలంగాణ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. వారి ముందున్న కొండలాంటి ప్రశ్న ఒకటే. ఇంతకీ మన పార్టీ స్టాండు ఏమిటి? సమన్యాయం అంటే విభజన కావాలన్నట్టా…లేదు వద్దేవద్దని చెప్పినట్టా? పోనీ.. చంద్రబాబును అడగాలనుకుంటే ఆయన ..‘ మీకెంత మంది పిల్లలు?’ అంటూ మొదపూడతారని దడ! పాపం.. పార్టీలోకి కొత్తగా వచ్చిన పాలమూరునేత డీకే గారికి ఈ సంగతి తెలియదు కాబట్టి అమాయకంగా చంద్రబాబునే ఆ పదానికి అర్థమేమిటని అడిగేశారు.

అదీ మేధోమథనంలో. సరే ఆయనేం చెప్పారు… ఈయనకేం అర్థమైంది అనేది అంత ముఖ్యం కాదు కానీ…ఆ సందర్భంగా జరిగిన సీనుతో ఒకటి తేలిపోయింది పార్టీలోని ఏ ఒక్కనేతకూ తమ పార్టీ స్టాండేమిటో తెలియదంటే తెలియదని!
ఏదేమైనా ‘సమన్యాయం’ నినాదాన్ని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు సర్వరోగనివారిణిలా భావిస్తున్నారు. ఈ నినాదంతో రెండు ప్రాంతాల్లో పార్టీ గట్టెక్కుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సీను రివర్స్‌లో ఉంటోంది. పార్టీ నేతల్లో గందరగోళం ఉంది.

ఈ మధ్య కాలంలోనే టీడీపీలో చేరిన మాజీ మంత్రి డీకే సమరసింహాడ్డి సమన్యాయం అంటే ఏమిటి? తెలంగాణ ఇవ్వాలంటున్నామా? వద్దంటున్నామా? స్పష్టంగా చెప్పండని ఇటీవల జరిగిన టీడీపీ మేథోమధన సదస్సులో బాబును నిలదీశారు.. బాబు జోక్యం చేసుకొని 2008 తీర్మానం అంటూ గతం ఎత్తుకోగానే… చరిత్ర వద్దు… ఇప్పుడు ప్రజలు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా అనే ఒకే మాటను కోరుకుంటున్నారన్నారు. దానికి సమావేశంలో పలువురు మద్దతు తెలిపారు. తెలంగాణలోని మెజార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇది విభజనకు వ్యతిరేకమేనని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమన్యాయం అంటే ఏమిటో మా నాయకుడికే స్పష్టత లేదని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు.

తెలంగాణ టీడీపీ నేతల్లో ఏర్పడిన సమన్యాయం గందరగోళాన్ని గుర్తించిన కేంద్ర మంత్రిజైపాల్‌డ్డి బుధవారం నిర్మల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ అభినందన సభలో సమన్యాయం అంటే అదేమైనా బ్రహ్మపదార్థమా? అని ప్రశ్నించారు. జైపాల్ ప్రశ్నతో బాబు ఉలిక్కి పడ్డారు.. నష్టనివారణకు ఇద్దరు టీడీపీ నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించారు.
ఏదేమైనా సమన్యాయం చేసే వరకు విభజన ప్రక్రియపై ముందుకు వెళ్ల వద్దని బాబు మాట్లాడటాన్ని తెలంగాణలో ప్రజలు తప్పు పడుతున్నారు. బాబు చెప్పే కథనే గ్రామాల్లో ప్రజలు కూడా రివర్స్‌లో అడుగుతున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు వేరుపడతామని ఒక నిర్ణయానికి వచ్చాకనే ఆ కుటుంబం ఆస్తులు, ఆప్పులు లెక్కలు వేసి పంచుతారని, వేరు పడాలని నిర్ణయానికి రాకుండానే ఎలా పంచుతారని అంటున్నారు.

ఇదే కోవలో రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించిన తరువాతనే పెద్దమనిషి అయిన కేంద్రం రాష్ట్రం ఆస్తులు, ఆప్పులు, నీటి పంపకాలు ఏవిధంగా చేయాలనే అంశంపై దృష్టి పెట్టిందని అంటున్నారు. విభజన చట్టంలో అన్ని వివరాలు ఉంటాయని, ఆ సమయంలో ఏ ప్రాంతానికైనా అన్యాయం జరిగిందని భావిస్తే బిల్లులో మార్పులు చేయమని అడుగవచ్చుగానీ ముందే చెప్పమంటే ఎలా సాధ్యమన్నారు. ఎలా చేయాలో చెప్పడానికి రమ్మంటే రాకుండా సమన్యాయం అంటే ఎలాగని టీడీపీ నాయకులను నిలదీస్తున్నారు. ఏం చేయాలో చెప్పకుండా, చేసేదాకా ఆగకుండా అసలు టీడీపీ అడుతున్నదేమిటని నిలదీస్తున్నారు. ఈ విషయాలు చెప్పిన ఓ సీనియర్ నేత పార్టీ వైఖరి తలనొప్పిగా ఉందన్నారు. ఇక సీమాంధ్ర నేతలది మరో బాధ. సమన్యాయం అంటే ఏమిటి రాష్ట్ర విభజనను ఆపమని అడుగుతున్నామా? లేక విభజన చేయమని కోరుతున్నామా? అనేది అర్థం కావడం లేదని వారంటున్నారు.

విభజనకు ముందు సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని అంటున్నారని, అసలు సమస్యలు ఏమిటో, వాటికి చూపే పరిష్కారాలు, కార్యాచరణ, ప్రణాళిక ఏమిటో ఇప్పటి వరకు తమనాయకుడు చెప్పడం లేదని సీమాంవూధకు చెందిన ఒక నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తమ నాయకుడు లేఖ ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళుతుందని సీమాంవూధలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుంటే తట్టుకోలేక పోతున్నామని వారంటున్నారు. తమ నాయకుడు ఇచ్చిన లేఖకు కట్టుబడే ఉన్నానని చెప్పి, సీమాంవూధకు న్యాయం జరగాలంటే ఏం చేయాలో చెప్పి, ఆ స్టాండ్‌పై పోరాడితే తమకు కలిసి వచ్చేదని అంటున్నారు. మొదట్లో సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ. 5లక్షల కోట్లు డిమాండ్ చేసి, ఆతరువాత వెనక్కు తగ్గడంతో పరిస్థితి మొదటికి వచ్చిందని అంటున్నారు. ప్రజల్లో అవుట్‌డేటెడ్ అయిన సమన్యాయం సిద్దాంతం పట్టుకొని వెళ్లాడితే నిండా పుట్టిమునగడం ఖాయమని ఈ పార్టీ సీనియర్ నేత ఒకరు వాపోయా

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.