సభ్యులు మాత్రమే అభిప్రాయం చెప్పొచ్చు: కోదండరాం

హైదరాబాద్: రాజ్యాంగం ప్రకారం తెలంగాణ బిల్లుపై కేవలం సభ్యులకు మాత్రమే అభిప్రాయం చెప్పే అవకాశముందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇవాళ టీ జేఏసీ భవన్‌లో జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యులకు తప్ప స్థానిక ప్రభుత్వానికి బిల్లుపై అభిప్రాయం చెప్పే అవకాశం రాజ్యాంగం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. ఇవేవీ తెలియక లోక్‌సత్తా జేపీ కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్నారని, నిబంధనలంటూ మరేదో అంటే మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అంశంపై ఫిబ్రవరి 7న ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహించామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చే పార్టీల నేతలను కూడా కలుస్తామని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.